#


Index

అనుక్తోప్య త్రభవతా - భవత్యా వచనా దహం - వనేవత్స్యామి. ఆయన చెప్పకపోయినా నీవు చెబితే చాలు నాకు. ఆరణ్యంలో వెళ్లి ఉండగలను. యద్రాజాన మవోచస్త్వమ్ - మమేశ్వరతరా సతీ - నీవే నన్ను శాసించవచ్చు. గదా. రాజుమీద మరలా నెపం దేనికి. సవాధర్మ స్పనాతనః - నీవు చేసిన పని చాలా మంచిది. ధర్మబద్ధం. చూడండి. ఎప్పుడెప్పుడు పరిగెత్తి పోదామా అనేంత తొందరలో ఉన్నాడు రాముడు. దానికి తగ్గట్టే ఆ తల్లికూడా నాయనా! మీ నాన్నగారు చెప్పలేదనేది ఒక మాట గాదు. తవత్వహమ్ క్షమమ్మన్యే - నోత్సుకస్య విలంబనమ్ ఎలాగూ కుతూహలంగా ఉన్నావు నీవు. ఇక విలంబం దేనికి బయలుదేర మంటుంది. ఆవిడకు తెలుసు రామావతార ప్రయోజనం. పోతే ఆవిడ చర్య నొక మిషగా చేసుకొని నాటకమాడదలచినట్టుంది రాముడి వ్యవహారం. తరువాత సీత కూడా తనతో వస్తానంటే రావద్దని నిరుత్సాహ పరుస్తాడు. ఆవిడ గట్టిగా పట్టుపట్టి నిష్ఠూరంగా మాటాడుతుంది. అప్పుడన్న మాటలుకూడా గమనిస్తే తెలుస్తుంది తెలిసి కూడా నాటకమాడే స్వభావం. నదేవి తవదుః ఖేన స్వర్గమవ్యభిరోచయే -సవిహాతుం మయాశక్యా - శక్తి రాత్మవతాయథా యత్సృష్టాసి మయాసార్థం – వనవాసాయ మైథిలి - అనుగచ్ఛ స్వ మాంభీరు - సహధర్మచరీభవ - నీవునాతో వనవాసం చేయటానికే సృష్టింపబడ్డావు. నిన్ను ఎడబాసి పోవటమంటూ ఉండబోదు. నాతో వచ్చి సహధర్మచారిణి వనే పేరు సార్థకం చేసుకో, ఏమిటీ మాటలు మొదట రావద్దనట మేమిటో ఇప్పుడు వచ్చితీరాలనట మేమిటో తవసర్వమభిప్రాయమ విజ్ఞాయ అనే మాటలో ఉంది దీనికి జవాబు. నాకు తెలిసినా నీ అభిప్రాయ మేమిటో నేను తెలుసుకోవాలిగదా అంటాడు. ఎంత లోతైన స్వభావమో చూడండి రాముడిది. మరి లక్ష్మణుడు కోపావేశం పట్టజాలక కైకను కొడతాను చంపుతానంటుంటే అనునయిస్తూ రాముడన్న మాటలు చూస్తే - ఆయన పరావరజ్ఞాన మోలాటిదో మనకు పట్టి ఇస్తాయి. కృతాంతస్త్వేవసౌమిత్రే

Page 20