#


Index

  దానికి జననీ జనకదార సఖిపుత్ర బాంధవ శత్రు ప్రియా ప్రియ జనులంటూ ఎవ్వరూ లేరు. ఆయనకు జన్మ కర్మము లును జన్మంబు లును లేవు. గుణ విరహితు డయ్యు గుణ వంతుడయి సర్వ రక్షణ వినాశకేళి సలుపుతున్నాడా మహానుభావుడు. అలాంటి పర తత్త్వాన్ని చింతించు పరమ భక్తుడు కూడా "అలఘ శ్రేయము బొందు బ్రహ్మ మయుడై - నిత్యుడై" అని భక్తి మార్గ నిర్గళిత రహస్యాన్ని కూడా బయట పెడతాడందరికీ.

  అయితే ఉద్దవుని ఇంత భాగవత దీక్షా పని చేయలేదా గోపకాంతల దగ్గర. వారు తమ్ము మోసగించిన ధూర్త గోపాలునే గాక ఆ ధూర్తునికి దూతగా వచ్చాడని చెప్పి ఇతణ్ణి కూడా ధూర్తుడు గానే భావించి ఉపాలంభించ సాగారు. అక్రూరుడి లాగానే ఉద్దవుణ్ణి కూడా అనరాని మాట లంటారు. “భ్రమరా దుర్జన మిత్ర.” ఆ కృష్ణుడు దుర్జనుడైతే ఆయన మిత్రుడవు నీవు ఇద్దరూ భ్రమర స్వభావులే. కృష్ణుడు మంచివాడని మాకెందుకు ఘోష పెడతావు. మరెవరి దగ్గరైనా ఏకరువు పెట్టు నీకింత తిండి పెడతారు. ఇదంతా ఉపా లంభం కాదు. కేవలమూ కృష్ణ విప్రలంభ జనిత తృష్ణా తిరేక ప్రేమాతి శయ విజృంభమే. అర్థమయింది ఉద్దవుడికి. అనురాగం శ్రుతి మించితే భక్తుడి మనస్తత్త్వ మలాగే ఉంటుందని. ఆ వాలు గంటుల భక్తి ముందు తన భక్తి కూడా చాలదని భావించాడు.

జప దాన వ్రత హోమ సంయమ తపః స్వాధ్యాయ ముఖ్యం బులన్ నిపుణల్ గోరియునే విభున్ మనములో నిల్పంగలే - రట్టిస ద్విపులా కారునిపై మహా మహిము సై విశ్వేశుపై మీ కజ స్రపటు ధ్యానము లిట్లు నిల్చునె భవ చ్చారిత్రముల్ చిత్రముల్

అని వారి నెంతగానో కీర్తిస్తాడు. నిపుణులనే మాటలో ఎంతైనా అర్ధముంది. పండితులకు పాండిత్య గర్వ విక్షేపాదు లడ్డు తగులుతాయి భక్తి మార్గంలో. అందుకే వారి కంత గట్టిగా నిలవ దది. పామరుల కలాటి విక్షేపాదు లుండవు కాబట్టి గట్టిగా నిలుస్తుందని భావం. కృష్ణ మూర్తి తప్పక మిమ్ము అచిర కాలంలోనే కలుసు కొంటాడు. మిమ్ము తలక వలదని నాచేత చెప్పి

Page 188