#


Index

తమ్మున్ నమ్మిన వారి దిగ్గ విడువన్ ధర్మంబు గాదండ్రు-వే పొమ్మా ప్రాణములే క్రియన్ నిలిపిరో ప్రొద్యద్వియోగాగ్నులన్ అని అక్రూరుజ్జీ పంపినట్టే రాయబారం పంపుతాడు గోపికల వద్దకు. అయితే అక్రూరు డాయనను మధురకు తీసుకు పోవటానికైతే - ఉద్దవుడాయన రాక తెలపటానికి.

  ఇదంతా ఒక నటన పరమాత్మకు. నిజానికిది తన కోసం కాదు. భక్తుల కోసం. ఒక భక్తుడి చిత్త వృత్తి ఎట్టిదో మరొక భక్తుడు గ్రహించాలి. తనదే కాదు భక్తి అంటే. అంతకు మించిన భక్తి మరొకరికికూడా ఉండవచ్చు లోకంలో. అది స్వయంగా పోయి కనులారా చూస్తే చెవులారా వింటే లన మనసులో దాగి ఉన్న గర్వగ్రంథి విరిసి పోగలదు. నిరహంకార మైన భక్తే నిజానికి భక్తి. అంతే గాదు. తన సమక్షంలోనే కాదు. పరోక్షంలో కూడా భక్తి నిలవాలి మానవులకు. అదే నిజమైన దీక్ష. అది నీకు నిజంగా ఉందో లేదో మరొకరిని చూచి అయినా తెలుసుకోమని భగవానుడు చేసే పరీక్ష అయినా కావచ్చు. అంతే కాదు. ఒక చోట కూచొని నా మూర్తి ని దర్శిస్తూ నన్ను స్మరించటమే గాదు. నా మూర్తి నందరిలో దర్శిస్తూ నా పనులు చేసి పెడుతూ - తద్వారా నా లోకహిత చర్య నీవూ కొంత పంచుకొని చేసినప్పుడే అది భాగవత భక్తి ప్రచారమని కూడా కావచ్చు. ఇన్ని మార్మికమైన అంత రార్థా లున్నాయిందులో. ఈ దృష్టితోనే ఇలాంటి కార్యాలీ మహా భాగవతుల కప్పుడప్పుడూ పురమాయిస్తుంటాడు పరమాత్మ. వీరిరువురకే పురమాయించా డంటే ఆయనకు వీరెంత సన్నిహితులో చెప్పబని లేదు. ఉద్ధవుణ్ణి పంపేటపుడు పైగా ఒకమాట అంటాడు. "లౌకిక మొల్లక నన్నా - లోకించు ప్రపన్నులకును లోబడి కరుణా లోకనముల బోషింతును. నాకాశ్రిత రక్షణములు నై సర్గికముల్” ఇది ఎంతో సాభిప్రాయమైన మాట. లౌకిక విషయ వాగురలో తగులు కొనక అలౌకికమైన తన భావాన్ని అంటి పట్టుకొన్న వారి నెప్పుడూ తాను తప్ప జూడడట. వారిని రక్షించటమే తనకు నైజమట. ఇది గోపికలకు చెప్పమని ఉద్దవుడితో అన్నాడంటే ఉద్దవుడి విషయంలోనూ అది వర్తిస్తుందనే గదా భావం.

Page 186