#


Index

అని తెగ వేసి ముక్త సరిగా ఉన్న సత్యాన్ని బోధిస్తాడు. శారీరకంగా వచ్చిన గ్రుడ్డి తనాన్ని ఏమీ చేయ లేక పోవచ్చు. కానీ మానసికంగానైనా గ్రుడ్డి వాడను కాదని నిరూపించుకోరాదా అని ఎంత నాజూకుగా మందలిస్తాడో చూడండి ఆ మహ నీయుడు. దాని కా ముదుసలి నీ మాట మంచిది నిశ్చయంబని మెచ్చుకోక తప్పింది గాదు. అయినా ధృతరాష్ట్రుడు ధృతరాష్ట్రుడే గదా. నాదే ముంది అంతా ఈశ్వ రేచ్ఛ అది ఎలా ఉంటే అలాగే జరుగుతుం దని లౌక్యం ప్రదర్శించబోతాడు. లోకోత్తరుడైన మహా భక్తుడి దగ్గరనా ఈ లౌక్యం. దాని కక్రూరుడిచ్చిన జవాబు చూడండి. నీ తలంపు గనుంగొంటి. నీ కిష్టం బగునట్లు వర్తింపుము. అంటే నీ తలంపే దుష్టమైనది. దానికి తగినట్టే నీ ప్రవర్తన. మరి ఆ ప్రవర్తనకు తగిన ఫలితమే చవి చూడబోతావు చివరకని హెచ్చరిక. ఈ హెచ్చరిక చేసి ఇక ఇతనికి చెప్పట మనవసర మను కొన్నాడో ఏమో, వెంటనే మధురకు బయలు దేరుతాడు. ఇదీ అక్రూరుని భాగవత సేవ.

  పోతే ఈజంటలో రెండవవా డుద్దవుడు. ఇతడూ యదు వంశోద్భవుడే. యాదవ వృద్ధుడే. కృష్ణుని కితడు స్నేహితుడూ - అమాత్యుడూ - ఆచార్యుడూ చివరకు శిష్యుడూ కూడా. ఇన్ని భూమికలలో సేవించాడా పరమాత్మను. ఉద్దవం - ఉత్సవం ఇవి రెండూ పర్యాయ పదాలు. పండుగ అని శబ్దార్థం. భగవంతుడి సాహచర్యమే అతని కొక పండుగ. ఒక విందు భోజనం. అది తప్ప అన్య మెఱగని వాడు. ఎఱిగినా అంత కన్నా మెఱుగ నని వాడు. మరి తన స్వామి చేతనే తాను సిద్ద విచారుడనీ - గభీరుడనీ . వృద్దవచో వర్ణ నీయుడనీ వృష్టి ప్రవరుడనీ - బుద్ధి నిధి అనీ - అమర గురుసముడనీ – ఎంతగానో ప్రశంస లందుకొన్న మహనీయు డాయన. కనుకనే ఏదైనా తన కాంతరంగిక కార్య ముంటే అది అక్రూరుని లాగానే ఉద్దవుడికే అప్పగిస్తుంటాడా పరమాత్మ.

రమ్మా యుద్ధవ గోప కామినులు నారాకాల్ నిరీక్షించుచున్ సమ్మోహంబున నన్నియున్ మఱచి యే చందంబునం గుందిరో

Page 185