#


Index

  “నాగర ప్రమదాళీ కుచకుంకు మాంకితల సత్రాణేశ దామ ప్రసూన మరం దారుణి తాన నుండ వగుటన్." అంతేకాదు నిలకడ కూడా లేనిదానివి నీవు. “ఒక పువ్వందలి తేనెద్రావి మధుపా యుత్సాహివై నీవు వేదొకటిం బొందెడి దానవే గద. ఇలా నిష్ఠూరంగా మదనోన్మాదలై పలుకుతుంటే ఉద్ధవుడు వారి నూరడిస్తూ "విశ్వేశుపై మీకజ స్రపటుధ్యానము లిట్లు నిల్చునే” ఎంత చిత్రమో గదా మీ చరిత్ర-” కృష్ణుడు మీకు చెప్పమన్న మాటలివి. "కలఁగని లేచి మున్ను గలఁగన్న సమస్త విధంబు గల్లగాఁ దలచిన భంగి” తజ్ఞుడైన వాడీ ప్రపంచాన్ని చూస్తాడు. మీరూ ఆతదుల మార్గంలో మెలగాలని నా ఆశ. అందుకే ఈ మార్గంలో నన్ను మీరలు చింతించుచు నుండఁగోరి యిటు దూరస్థత్వముం బొందితిన్” “తలకం బోలదు నన్ను గూడెదరు నిత్య ధ్యాన పారీణలై" ఇదే ఆఖరి మాట. ఇక కృష్ణుడు వచ్చింది లేదు. వారిని చూచింది లేదు. నిత్య ధ్యాన పారీణలై ఉండటమే వారు పాటించవలసిన విధి.

  ఇదే చివరకే భక్తుని విధి అయినా. సగుణ భక్తి మానవుని తరింప జేయదు. అది ఒక అలంబన మాత్రమే. దానిని విడవ కుండా నిత్యమూ పట్టుకొని కూచున్న వాడికదే కొంత కాలానికి నిర్గుణంగా పరిణమిస్తుంది. దానికి భగవన్మూర్తి ఇక కనిపించ గూడదు. అది పూర్తిగా అంతర్హితమై పోవాలి. అప్పుడే నిలకడ భక్తికి. ఇలాంటి భక్తి నలవరుచుకొని జన్మ తరింప చేసుకోటానికే జన్మించారీ గోపికలూ ఆ గోపకులు. గోపకులు దేవతలైతే గోపికలా దేవతాస్త్రీలైన అప్సరసలేనని పేర్కొన్నాము. అదీ ఒక సంకేతమే. వాస్తవానికీ దేవతలూ దేవకన్యలూ ఎవరో గాదు. మానవుడి ఇంద్రియ వ్యాపారాలే దేవతలు. దీవ్యతి ప్రకాశతే ప్రత్యర్థ- మితి దేవః దేవతా. శబ్ధ స్పర్శాదులైన ప్రతి ప్రాపంచిక విషయమూ దేనివల్ల ప్రకాశిస్తున్నదో అది దేవత. త్వక్చక్షు రాదీంద్రియ వ్యాపారాల మూలంగానే కదా అది. అవి అనంత కోటి ఆ వ్యాపారాలు. అనంతకోటి దేవతలీ వ్యాపారాలే. వీరే గోపకులు.

Page 175