“చతుర్విధా భజంతేమా”మ్మన్నట్టు- అందరికీ ఒకే విధమైన అధికార సంపత్తి ఉండదు. కొందరార్తులేతే కొందరు జిజ్ఞాసువులు. కొంద రర్థార్థులైతే కొందరు జ్ఞానులు. కుంతిది ఆర్త భక్తి. అయితే జీవితంలో ఒడుదుడుకు లన్నీ తిన్న తరువాత అదే జీవితంలో జిజ్ఞాసగా జ్ఞానంగా పరిణ మించిం దావిడకు.
ముఖ్యంగా పాండవు లైదుగురు తప్ప వారి బలగా న్నంతటినీ రాత్రికి రాత్రి అంత మొందించి వారి కొడుకులను కూడా వధించి కడకు ఉత్తర గర్భానికి కూడా ఎసరు పెట్టిన అశ్వత్థామ చర్య కామె పరతపించి పోయింది. దానితో ఇక తన వంశమే విచ్ఛిన్న మవుతుందని తహతహ లాడింది. అలాంటి సందర్భంలో ఎవరికీ అంతుపట్టకుండా కోడలి గర్భంలో ప్రవేశించి దారుణమైన ఆ బాణాగ్నిని రూపుమాపి గర్భస్థ శిశువును కాపాడిన కృష్ణుని చర్య తిలకిస్తే ఆయన లోక సామాన్యమైన వ్యక్తి కాదు - పరమాత్మే ననే భావం ఆమెకు బాగా మనసుకు నాటింది. అంతవరకూ బీజరూపంగా ఉన్న భక్తి మొలకెత్తి చిగురొత్తి పుష్పించి ఫలించి నలుదెసల పరిమళాలు గుబాళించింది. అత్తా ! వెళ్లి వస్తానని అన్నమాట మేనల్లుడి మాటగా అనిపించ లేదా విడకు. కనుమరుగైతే మరలా కనిపిస్తాడో లేదో నని దగ్గరగా వచ్చి
శ్రీకృష్ణా యదు భూషణా నరసఖా శృంగార రత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశ దహనా - లోకేశ్వరా - దేవతా నీక బ్రాహ్మణ గోగణార్తి హరణా - నిర్వాణ సంధాయకా నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవ లతల్ నిత్యాను కంపానిధీ అని వాపోతుంది.
ఈ మాటలు బాగా గమనించండి. ఆయన యదు భూషణుడట-నరసఖుడట. అంటే తన పుట్టినింటి వాడు కాబట్టి తన పుత్రుడైన అర్జునుడికి అన్నిటా బాసట అయి నిలిచాడు. అంతేకాదు. శృంగార రత్నాకరుడు.
Page 146