#


Index

  లేము. అది ఏమిటో దాని నెల గ్రహించాలో లోకానికి బోధించ టానికే మహర్షి భాగవతారంభంలోనే ఈ పద్యపంచకాన్ని రచించాడు. భాగవత సౌధాంతః ప్రవేశాని కిది ముఖ ద్వారం లాంటిది. దీని ద్వారా పోతేనే భగవ త్స్వరూపాన్ని మనం దర్శించగలం. భాగవత పురాణ రహస్య మంతా అసలీ అయిదు పద్యాల లోనే గుంభిత మయి ఉంది. భగవదవతార తత్త్వ మంతా ఇందులోనే గర్భిత మయి ఉంది. దీని నర్థం చేసుకొని ఇదే ఒక కర దీపికగా చేత పట్టుకొని లోపల ప్రవేశించిన వాడు పురాణ ప్రాసాదంలో ఆయా కక్ష్యాంత రాలు గడచి పోయి క్షేమంగా వచ్చి బయట పడ గలడు. లేదా వాడి పాలిటి కది ఒక మయ సభ లాగా మారిపోయి ఉన్నది లేనట్టూ లేని దున్నట్టూ దృగ్రమ గొలిపి దిగ్రమకే దారి తీస్తుంది. దానితో అసలు భాగవతమూ అర్థం కాదు. భగవ దవతారాలూ అర్థం కావు. అన్నిటి కన్నా కృష్ణావతారమూ దాని లీలలూ అసలే అంతు పట్టే వ్యవహారం కాదు.

Page 144