#


Index

  మాదిరి మనం కూడా ఈశ్వర దూషణ చేయటానికే ఉద్యుక్తుల మవుతాము. ఇంతకూ “యేయథా మాం ప్రపద్యం తేతాంస్త ధైవ భజా మ్యహ” మన్నాడు. భగవానుడే. ఎవరే దృష్టితో చూస్తే వారి కాయన అలాగే దర్శన మిస్తాడు.“అస స్నేవ స భవతి అసద్రహ్మేతి వేద చేత్” లేడు లేడని వాదిస్తే వాడికాయన లేనేలేడు. అంతే కాదు. ఉన్న తత్త్వాని కేమీ హాని లేదు. వీడు లేదన్నా అది ఉండనే ఉంటుంది. కాని హాని. వీడికే. ఎందుకంటే ఉన్న దాన్ని వదిలేసి లేని ప్రపంచాన్ని పట్టుకొన్నాడు వీడు. అది ఎప్పుడూ లేనిదే కాబట్టి దీన్ని పట్టుకొని ఊగులాడిన నేరానికి వీడూ లేకుండానే పోతాడు. అలా కాక "ఆస్తి బ్రహ్మేతి చేద్వేద సంత మేనం తతో విదుః" ఎవడా బ్రహ్మ తత్త్వాన్ని విడవకుండా పట్టు కొన్నాడో వాడు దాని లాగానే ఎప్పటికీ ఉంటాడు. “తస్యాహం నప్రణ శ్యామి-సచమే నప్రణ శ్యతి” అని గదా భగవానుడి హామీ. ఆయన వీడి దృష్టికి లేకుండా పోడు. కాబట్టి వీడూ ఆయన దృష్టికి లేకపోడు. అంటే జనన మరణాలు లేని నిత్య స్థితిని పొందుతాడని భావం. ఇలాంటి బ్రాహ్మీ స్థితిని సోదాహర ణంగా కీర్తిస్తున్నాడు ప్రస్తుతమీ అయిదవ పద్యంలో.

అథేహ ధన్యా భగ వంత ఇత్థమ్ యద్వాసు దేవే. - ఖిల లోక నాథే కుర్వంతి సర్వాత్మక మాత్మ భావమ్ నయత్ర భూయః పరివర్త ఉగ్రః హరి పాద ద్వయ భక్తి మీ వలన నిట్లా రూఢమై యొప్పునే తిరుగం బాఱదు చిత్త వృత్తి హరిపై దీపించి మీలోప లన్ ధరణీ దేవత లార మీరలు మహా ధన్యుల్ సమస్తజ్ఞు లున్ హరిచింతన్ మిముచెంద వెన్నడును జన్మాంత వ్యథా యోగముల్

ధరణీ దేవత లిక్కడ శౌనకాది మహర్షులే. వారినే సంబోధించి చెబుతున్నాడు. భాగవత ప్రచారకుడు సూతుడు. వారి ద్వారా మనందరికీ చేసే బోధ ఇది.

Page 142