#


Index

  “యః పృథివ్యామ్ తిష్ఠన్" అని చాటుతుంది అంతర్యామి బ్రాహ్మణం. గీత కూడా చెబుతుంది. “ఈశ్వర స్సర్వ భూతానాం హృద్దేశే 2ర్జున తిష్ఠతి”. అని. అన్నింటి లోనూ ఉండి అన్నింటి లోపలా వెలుపలా వ్యాపించి వాటన్నిటినీ త్రిప్పుతూ ఉన్నదదే ఆయె. చక్రి అనే మాట ఎంతో సార్థకంగా ప్రయోగించాడు మహాకవి. భ్రామయన్ సర్వభూతాని అన్నప్పుడు చక్రం లాగా త్రిప్పే వాడనే గదా అర్థం. అలాంటి సర్వ వ్యాపకుడూ సర్వాత్మకుడూ అయినవాడెలా జన్మిస్తాడని. అయితే రామకృష్ణా ద్యవతారా లెత్తాడని చెప్పట మేమిటి. ఎత్తాడని చెబుతున్న దెవరు. వేద వ్యాసాదులైన కవులు. కవీశ్వరులు కాబట్టి గొప్ప గొప్ప వర్ణనలు చేస్తూ వచ్చారు పుట్టాడని చేశాడని. అవి వారి పొగడ్తలే గాని నిజంలో పరమాత్మ పుట్టా లేదు చేయాలేదు. శాస్త్రంలో ఎక్కడ ఏవాక్యం తడవి చూచినా జీవుడికి లాగే దేవుడికి కూడా జన్మాదులు లేవనే మనకు చాటుతుంది. జీవుడికే లేనప్పుడిక నిత్య ముక్తుడైన ఈశ్వరుడికి చెప్పటం హాస్యాస్పదం. అలాంటప్పుడు కృష్ణుడిక దేవకీ వసుదేవులకు జన్మించటమూ వట్టిదే. ఆయన చేసిన కంసవధాది కార్యాలూ వట్టివే.

  అంతా వట్టిదే అయితే మరి ఈ లోకాలన్నిటినీ ఎవడు సృష్టించాడు. ఈ జీవుల నెవడు సృష్టించాడు. ధర్మ సంస్థాపన కోస మని ఈ అవతారాలన్నీ ఎవడు ధరించాడు. అంతా వట్టిదని కొట్టివేస్తే మరివన్నీ కొన్ని గాకపోయినా కొన్నైనా కనిపిస్తున్నాయి గదా. అనుభవాన్ని ఎలా కాదనగలం. అని ప్రశ్న వస్తుంది. దానికి సమాధాన మిస్తున్నాడు.

  "సవా ఇదం విశ్వమమోఘ లీలః సృజత్యవ త్యత్తి-న సజ్జతే స్మిన్ భూతేషు చాంతర్హిత ఆత్మ తంత్రః-షాడ్వర్గికం జిఘ్రతి షడ్గుణేశః-” భువన శ్రేణి నమోఘ లీలు డగుచుం బుట్టించు రక్షించు - నం త విధిం జేయు-మనుంగడందు బహు భూతవ్రా తమం దాత్మతం త్ర విహార స్థితుడై-షడింద్రియ సమస్త ప్రీతియున్ దవ్వులన్

Page 134