#


Index

  క్షాత్ర ధర్మాన్ని సూచిస్తుందీమాట. దుష్ట నిగ్రహం చేసి ప్రజలకు క్షేమ కరంగా పరిపాలన సాగించటమే గదా ఉత్తమ క్షత్రియులు పాటించవలసిన కర్తవ్యం. కడు విప్పగు వక్షము వాడు. అయితే దానికి తగిన బల పరాక్రమాలు కూడా ఉండాలి క్షత్రియుడికి. “వ్యూడోరస్కో వృషస్కంధః” అన్నట్టు అలాంటి శరీర సౌష్ఠవం కూడా అలవడినవాడని భావం. నిక్కిన భుజంబుల వాడని చెప్పటం కూడా దీనికి సూచకమే. మేలుపై జల్లెడు వాడనటంలో శిష్ట రక్షణం గోచరిస్తుంది. పోతే యశంబు దిక్కులం జల్లెడు వాడు నైన రఘు సత్తము డిచ్చుత మాక భీష్టముల్. ఇలాంటి గుణ సంపద ఉన్న వాడికే యశస్సంపద. వాడే లోకుల కభీష్ట ఫల ప్రదాత కాగలడు. ఉత్తమ మానవ మానవేం ద్రోచితమైన వర్ణన ఇది. మానవాతీతమైన వర్ణన ఇంతకు ముందరిది. అది నివృత్తి ధర్మ స్వరూపాన్ని - ఇది ప్రవృత్తి ధర్మ స్వరూపాన్ని లోకులకు సూచించటానికి మహాకవి చేసిన చిత్రరచన. మొత్తం మీద భగవత్తత్త్వాని కెక్కడి కక్కడ అద్దం పట్టినట్టే కనిపిస్తుంది గోపికలు చేసే ప్రతి ఆలాపనలో. ఇలాంటి భగవల్లీలనే అక్రూరుడు కూడా దర్శించి ఎంతగానో కీర్తిస్తాడు. కలలం బోలెడి పుత్ర మిత్ర వనితా గారాది సంయోగముల్ జల వాంఛారతి నెండమావులకు కాంక్షల్ సేయు చందంబునన్ తలతున్ సత్యములంచు మూఢుడ- వృథా తత్త్వజ్ఞుడన్ నాకునీ విల సత్పాద యుగంబుఁ జూపి కరుణన్ వీక్షింపు లక్ష్మీపతీ.”

  అక్రూరుడు యాదవుల కుల పెద్దలలో ఒకడు. విభీషణుడి లాంటి స్వభావ మతనిది. భీషణుడు కానివాడు విభీషణుడైతే క్రూరుడే మాత్రమూ కాని వాడక్రూరుడు. అలాంటి వాడి నతి క్రూరుడైన కంసుడొక క్రూరమైన పనికి నియోగించాడు. ధనుర్యాగ మనే నెపంతో రామకృష్ణులను తీసుకురా వారి పని నేను చూచుకొంటా నని పంపుతాడు. అతడు కాదని చెప్పలేదు.

Page 127