#


Index

  ఏమిటీ సన్నివేశం. ఏమి చెబుతుంది మనకు. బ్రహ్మకు తాను సకల జగత్కర్త నని అహంకారమున్నది. తానే విష్ణు నాభి కమలం నుంచి సృష్టి అయిన వాడు తన కన్నా సృష్టి కర్త లేడని అహంకరించట మేమిటి. నీ సృష్టి ఎంత నీవెంత నేనిచ్చినదే గదా నీకా శక్తి - నీతో సహా ఈ చరా చర జగత్తునంతా సృష్టించిన వాడను నేను కావలసి వస్తే చూడు నా మహిమ అని తన అఘటన ఘటనా పటీయసి అయిన ఐశ్వర్య శక్తిని తార్కాణచేయట మిది. దీనితో చతుర్ముఖుడికి సహజంగా ఉన్న రజోమాలిన్యం పోయి సత్త్వగుణ మలవడాలని కూడా ఇది ఒక ప్రబోధమే.

  పోతే దేవేంద్రుడి దింకా రాజసమైన ప్రవృత్తి. బ్రహ్మకు సృష్టికర్తననే అభిమాన ముంటే ఇతడికి సృష్టి అయిన ఈ త్రిలోకాలనూ పాలించే అధికారంనాదే గదా అనే దురభిమాన ముంది. దానిని కూడా వదలించాలను కొన్నాడు భగవానుడు. నందాదులు ఏటేటా చేసే ఇంద్రోత్సవం అక్కర లేదని వారించాడు. "తస్మాద్గవాం బ్రాహ్మణానా- మద్రేశ్చా రభ్య తామ్ మఘః” దాని బదులు గోవులకు బ్రాహ్మణులకూ గోవర్ధనాద్రికీ ఉత్సవం జరపమని బోధించాడు. “ఏతన్మ మమతం తాతక్రియ తాం యది రోచతే-” ఇది నా అభిప్రాయం- మీ కిష్టమైతే చేయండి అని చెబుతాడు. సరేనని వారాయన చెప్పినట్టుగానే చేస్తారు. ఇంద్రుడి కెక్కడలేని ఆగ్రహం వచ్చి ఆగ మేఘాలుగా వర్షం కురిపిస్తాడు. వవృషుర్జల శర్కరాః- ఏక ధారగా శిలా వర్షం కురుస్తాయి మేఘాలు. దానికి భయకంపితులైన ప్రజనివాసి ప్రజల నందరినీ చూచి కృష్ణుడు గోవర్ధనాద్రిని ఒంటి వ్రేలితో పైకెత్తి

బాలుండీతడు కొండ దొడ్డది మహా భారంబు సైరింపగా జాలం డోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోకు-డీ శైలాం భోనిధి జంతు సంయుత ధరా చక్రంబుపై ఁబడ్డనా కేలల్లాడదు బంధు లార నిలుడీ క్రిందన్ ప్రమోదంబునన్ అని ఆహ్వానిస్తాడు.

Page 114