నిజం. కాని పుట్టాడో లేదో వెంటనే పెరిగి పెద్ద వాడైన ప్రౌఢ వయస్కుడి లాగా కనిపించాడు తల్లిదండ్రులకు. అది కూడా ఎలాంటి రూపంలో కనిపించాడు వారికి.
తమ ద్భుతమ్ బాలక మంబు జేక్షణం చుతుర్భుజం శంఖ గదా ద్యు దాయుధమ్ శ్రీ వత్స లక్ష్మం గళశోభి కౌస్తు భం పీతాంబరం సాంద్ర పయోద సౌభగం
మహర్హ వైడూర్య కిరీట కుండల - త్విషా పరిష్వక్త సహస్రకుంతలమ్ ఉద్ధామ కాంచ్యంగద కంకణాదిభి - ర్విరోచ మానమ్ వసుదేవ ఐక్షత
ఇలాంటి వాణ్ణి దర్శించాడట వసుదేవుడు. అలోక సాధారణమైన ఈ అద్భుత వేషాన్ని వర్ణించటంలోనే తెలుస్తూంది మనకది సాక్షాత్తూ నారాయణ మూర్తేనని. కనుకనే అది చూడగానే వసుదేవుడు “విది తోసి భవాన్ సాక్షాత్పురుషః ప్రకృతేః పరః " అని ఆ మూర్తిని పరమ పురుషుడు గానే గుర్తించి కీర్తిస్తాడు. తల్లి దేవకి కూడా స్తుతిస్తుంది. అసలంతకు ముందు గర్భంలో ఉండగానే వచ్చి బ్రహ్మేం ద్రాది దేవతలంతా గర్భస్థు డైన స్వామినే ఎన్నో విధాలుగా స్తోత్రం చేసి పోతారు. ఇదంతా కృష్ణుడు సాక్షాత్తూ నారాయణడే నని చెప్పకుండానే చెబుతున్నది లోకానికి.
దేవకీ వసుదేవుల స్తోత్ర పాఠ మంతా విని స్వామి దేవకిని చూచి నీవు పూర్వ జన్మలో పృశ్నివి. ఇతడు సుతవుడనే ప్రజాపతి. ప్రజా సర్గం చేయమని మిమ్ములను బ్రహ్మ ఆదేశిస్తే మీరు ద్వాదశ దివ్యవర్ష సహస్రాలు నన్ను గూర్చి తపస్సు చేశారు. నేను ప్రత్యక్షమై వరం కోరమంటే నాలాంటి కొడుకు కావాలని కోరుకొన్నారు. జగన్మోహిని అయిన నామాయ పనిచేసి మీరు అపవర్గం కోరలేక పోయారు. దాని ఫలితంగా నేను మీకు మొదటి జన్మలో పృశ్ని గర్భుడనే పేర జన్మించాను. రెండవ జన్మలో అదితి కశ్యపులైన
Page 108