ఈ విధంగా ఈ యోగమాయా వృత్తాంతం గాయత్రీ వృత్తాంతానికి అద్దం పట్టినట్టుగా కనిపిస్తున్నది. భాగవతారంభంలో మనమొక మాట చెప్పుకొన్నాము. వృత్రాసుర వధ- గాయత్రీ మంత్రార్ధవివరణ ఎక్కడ వర్ణించ బడతాయో అది భాగవతమని. రెండింటి విషయమూ మొదటి రెండు శ్లోకాల లోనే భంగ్యం తరంగా స్ఫురింపజేశారని కూడా పేర్కొన్నాము. అందులో వృత్రాసుర వధ వృత్తాంతం భాగవత మారవ స్కంధంలో సూటిగానే వర్ణించ బడింది. పోతే రెండవ దైన గాయత్రీ వృత్తాంతమలా సూటిగా ఎక్కడా వర్ణించినట్టు కనిపించదు భాగవతంలో. ఇదుగో ఇక్కడ మనకది భాగవతం ఈ యోగ మాయా వ్యాజంతో చాటుగా నిర్దేశిస్తున్నది. నన్ను విరోధం చేసుకొని ప్రయోజనం లేదు. నిజంగా నీకు పరమాత్మ తత్త్వం గ్రహించాలని కోరికే ఉంటే నన్నవలంబనంగా చేసుకో పరమాత్మ ఎక్కడ ఉన్నాడో నివేదిస్తాను. అలా కాక దూరం చేసుకొన్నావంటే నాకూ పరమాత్మకూ కూడా దూరమవుతావని కంసుడు నెపంగా మన బోటి జిజ్ఞాసు లోకానికంతా చేసే నిగూఢ ప్రబోధమిది.
మొత్తం మీద యోగమాయ హెచ్చరించినట్టుగానే జరిగింది కృష్ణజన్మ. కంసుడి కేమాత్రమూ అంతుపట్టలేదు. అష్టమ గర్భమని తెలియక కాదు. కంసుడికి. తెలిసి కూడా ఆ అష్టమ మైన గర్భం కృష్ణుడుగా గాక యోగమాయగా దర్శన మిచ్చింది వాడి దృష్టికి. అంతే మరి. రాజస తామస మైన దృష్టితో చూస్తే భగవత్తత్త్వ మెలా గోచరిస్తుంది. దానికి మారుగా తదాభాస అయిన మాయే మనకు గోచరమయ్యేది. అలాగే గోచరమయింది కంసుడికి. మాయ కనపించి మరలా మాయమయింది. పోతే తదా ధారమైన అసలు పదార్థమెక్కడ ఉన్నట్టు. అది ఆ పాటికే దేవకికి జన్మించనూ జన్మించింది. రాత్రికి రాత్రి యశోద వద్దకు చేరనూ చేరింది. అసలది జన్మ అయితే గదా. జన్మ అనుకొంటే జన్మ. కాకుంటే కాదు. నవమాసాలూ దేవకీ దేవి మోసింది ఖాయం. నవమాసాలూ నిండి శిశువు జన్మించిందీ
Page 107