వాడికి వెంటనే ఒకటి జ్ఞప్తికి వస్తుంది. "ఆత్మాన మిహ సంజాతం జానన్ ప్రాగ్విష్ణునా హతం మహా సురం కాలనేమిమ్" ఇంతకు ముందు విష్ణువు చేత నిహతుడైన కాలనేమి అనే రాక్షసుణ్ణి నేనని గ్రహిస్తాడు వాడు. కాలనేమి అంటే కాల చక్రమే. అదే కంసా కారం. కంసమంటే గుండ్రని పాత్ర. అంటే చక్రమనే అర్థం. అది నిరంతర భ్రమణ శీలం. ధర్మా ధర్మాలు పరివర్తన చెందు తుంటాయి దానితో. తన్నిమిత్తంగా భగవంతు డవతరిస్తుంటాడు. కాబట్టి కాలనేమి-కంసుడనే పేర్లు కూడా సాభిప్రాయమే.?
చూడబోతే ఇదంతా ముందుగానే పరమాత్మ వేసిన పథకంగా కనిపిస్తుంది. లేకుంటే నారదుడు రావట మేమిటి- ఈ దేవ రహస్యాలన్నీ వాడికి చెప్పట మేమిటి - మరలా దేవకీ వసుదేవులను జైలులో పెట్టించట మేమిటి. అంతా భగవల్లీల. భగవాను డొకనాడు వైకుంఠంలో కూచొని తన యోగ మాయ నిలా ఆజ్ఞాపిస్తాడు.
దేవక్యా జఠరే గర్భమ్ శేషాఖ్యం ధామ మామకం తత్సన్ని కృష్య రోహిణ్యా ఉదరే సన్ని వేశయ
నా అంశ ఒకటి శేషాఖ్య మైనది దేవకి సప్తమ గర్భంగా ఏర్పడుతుంది. దానిని నీవు సంకర్షణ చేసి నందగోవ్రజంలో తలదాచు కొంటున్న రోహిణి గర్భంలో ప్రవేశ పెట్టు. “ఆథాహ మంశ భాగేన దేవక్యాః పుత్రతామ్ శుభే ప్రాప్స్యామి - నేను మిగతా అంశతో దేవకికి అష్టమ గర్భంగా అవతరిస్తాను-త్వం యశో దాయాం నంద పత్న్యాం భవిష్యసి - నీవు మాత్రం యశోదకు బిడ్డగా జన్మిస్తావు. నిన్ను లోకులు
దుర్గేతి భద్ర కాళీతి - విజయా వైష్ణ వీతిచ కుముదా చండికా కృష్ణా-మాధవీ కన్యకేతిచ మాయా నారాయణీ2 శానా శారదేత్యం బికేతిచ భజి ష్యంతి
ఈ ఈ సంజ్ఞలతో నిత్యమూ పూజిస్తూ పోతారు.
Page 103