మానవులందుకొని ఆస్వాదించాలి. ఆనందించాలి. తరించాలి. జగన్నాటక సూత్రధారి అయిన ఆ భగవానుడి సంకల్పమేదో దాన్ని మనకందజేయటాని కాయనకూ మనకూ మధ్య రాయబారిగా నిలిచాడు వాల్మీకి మహర్షి. రాయబారమేదో గాదు రామాయణమే. ఏమిటది మనకందించే సందేశ రహస్యం. అర్థకామాలకన్నా విలువైనది నిష్కామమైన ధర్మవర్తనం. అంతకన్నా అనర్హమైనది మోక్షసాధన మార్గం. దానినేమరక జీవించినదే సుజీవితం. అప్పుడే యావత్ప్రస్యంతి గిరయ స్సరితశ్చసముద్రగాః తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతి అని ముక్త కంఠంతో చాటిన మహర్షి సుభాషితం అక్షరాలా సార్ధకమవుతుంది.
Page 335