#


Index

రామ యాథాత్మ్యము

నివసిస్తానని హామీ ఇస్తాడు. మధ్యలోకూడా ఆత్మానమ్ మానుషమ్మన్యే నన్ను నేను మనుష్యుడననే భావిస్తున్నానంటాడు. దీనిని బట్టి మనుష్యుడుగా జన్మించి మనుష్యుడుగా భావిస్తూ రావణాదులకు కూడా మనుష్యుడనే భ్రమ కలిగించటానికి మానవోచితంగానే ప్రవర్తించటం వల్ల రాముడు భగవంతుడనే భావం ఎవరికీ కలగటంలేదు.

  దీనికి తోడు రెండూ విభవావతారాలే అయినా కృష్ణావతారంలో లాగా వేషభాషలుగాని, లీలలుగాని ఏవి చూచినా రాముడు మానవుడనే తోస్తుందిగాని భగవదవతారమనే భావమెక్కడా కనపడదు మనకు. కృష్ణుణ్ణి లీలామానుషుడనీ, రాముణ్ణి మాయామానుషుడనీ లోకులు వ్యవహరిస్తుంటారు. మాయామానుషుడని రాముణ్ణి వర్ణించటం మాయకతీతుడనే దృష్టితోగాదు. దానికధీనుడయి ప్రవర్తించాడనే అభిప్రాయంతో అనేమాట. రాముడి జీవితం కొనామొదలు ఎక్కడ ఏ ఘట్టం చూచినా మానవోచితంగానే సాగిందిగాని తదతీతంగా సాగినట్టెక్కడా కనిపించదు. అలా సాగింది కృష్ణావతారంలోనే. మాయకధీనుడు కాడాయన. అతీతుడు. కనుకనే ఈయన మాయామానుషుడైతే ఆయన లీలా మానుషుడని ప్రఖ్యాతి గాంచారు. మానవ శరీరంతో అవతరించాడని మాటే. ఆయన జీవితంలో ప్రదర్శించింది ప్రతి ఒకటీ ఒకలీలే. అసలు జీవితమంతా లీలామయమే. భగవదవతారమనే సత్యమడుగడుగునా మనకు కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. గరుత్మంతుడు పిలిస్తే పలుకుతాడు కృష్ణుడికి. ఎక్కడికి వెళ్లాలన్నా గరుత్మంతుడిపైనే. రాముడి జీవితంలో ఎక్కడా కనిపించడు గరుత్మంతుడు. ఎప్పుడో యుద్ధ సమయంలో నాగపాశబద్ధుడయి నప్పుడాపద్ధర్మంగా మాత్రమే దర్శనమిస్తాడు. అదీ అవసరం తీరగానే మాయమయిపోతాడు. సముద్రం రాముడికి దారే ఇవ్వలేదు. కోపం వచ్చి మీద బాణప్రయోగం చేయబోతేగాని దర్శనమీయడు. అప్పటికీ సేతువు నిర్మించి వెళ్లిపొమ్మని సలహా ఇచ్చాడేగాని దారి ఇవ్వటానికుద్యుక్తుడు కాలేదు. మరి కృష్ణుడికో. పార్థసారథికమైన రథాన్ని అల్లంతదూరాన చూచాడో లేదో హడలిపోయి ఆ రథం వెళ్లినంత దూరం శిలారూపుడై పడిపోయాడు. కృష్ణుడి రథం సప్త కుల పర్వతాల మీదుగా కూడా ఎగిరి పోగలిగితే రాముడి రథం భూమిమీద పయనించటమే ఎక్కువయింది. అంతేకాదు. రాముడు తన జీవితంలో ఎవరికిగాని గురుత్వం వహించలేదు. ఒకరి

Page 122

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు