విశ్వేశ్వరుడి రూపం. విభూతి అనేది విభువు యొక్క విస్తారం. ఆ విభువనండి. విశ్వేశ్వరుడనండి. అది మూలపదార్ధం Substance Base విశ్వం. దీని కధిష్ఠానమనండి. ఆధారమనండి విశ్వేశ్వరుడే. అంటే పరమాత్మ స్వరూపమే చరాచర ప్రపంచాని కాధారం. దాని రూపమే ఇది అదే ఇన్ని -రూపాలలో భాసిస్తున్నది. దానికే విశ్వరూపమని పేరు పెట్టారు. అయితే ఎలాగూ మనం నిత్యమూ. చూస్తున్నాము గదా ఇక క్రొత్తగా ఎవడో చూపితే చూడాలని దేని కుబలాటం. చెప్పాము గదా. అండ పిండ బ్రహ్మాండాలన్నీ ఒక్కసారిగా ఆకళించుకోవాలనే ఆశ వదలక నని. -
అయితే అది సాధ్యమా. సాధ్యమే. ఎప్పుడూ. దానివరకే గాక దాని కధిష్ఠానమైన Base విశ్వేశ్వర స్వరూపాన్ని గుర్తించ గలిగితే, అలా గుర్తించాలంటే దేశ కాల వస్తువుల పరిధి ఎంత ఉందో అంతా మనసుకు రావాలి. అదే దివ్య దృష్టి. అదే అర్జునుడికి కృష్ణుడు ప్రసాదించాడనే మాట. ఇచ్చాడు గదా అర్జునుడెందుకు భయపడ్డాడు. దృష్టి స్వప్రయత్నంతో వచ్చింది కాదు. తాత్కాలికంగా పరమాత్మ తనకిచ్చింది. అలాగైతే ప్రతి ఒక్కరికీ ఇవ్వగలడాయన. కాని ఎలా వస్తుందో అలాగే
Page 54