#


Index

ప్రస్థానత్రయ సారము

యద్భావ స్తద్భవతి. మన భావనను బట్టే ఫలితం. అది సగుణంగా కొంత కాలం నన్ను భజిస్తే వారికి నిర్గుణ జ్ఞానం నేనే కలుగజేస్తా నంటాడు పరమాత్మ. మరి ఆ సగుణమైన విభూతి ఎలాంటిదో ఏయే భావాలలో దర్శించాలని అడిగితే సమాధాన మిస్తున్నాడు. అందులో మొదట నిర్గుణమైన స్వరూపాన్ని సంగ్రహంగా చెప్పి తరువాత తన విభూతినంతా వర్ణిస్తూపోతాడు.

  అహమాత్మా గుడాకేశ - ఆత్మ స్వరూపమే అది. ప్రతిచోటా ఉన్నదనే స్ఫురణ ఏదుందో అదే ఆత్మ. అదే ప్రతి పదార్ధానికీ ఆది మధ్యం అంతం. అది తప్పించి ఏ నామము లేదు. రూపము లేదు. పోతే ఇక ఈ నామ రూపా లేమిటంటారా. ఇవన్నీ దాని విభూతి విస్తారం. అదే చిలువలు పలువలు పెట్టి వర్ణిస్తాడు. ఆదిత్యులలో విష్ణువునని రుద్రులలో శంకరుణ్ణి వృక్షాలలో అశ్వత్థామని అశ్వాలలో ఉచ్చైః శ్రవమని ఇలాగా.

  అయితే ఒక్కొక్క జాతిలో ఒక్కటేనా విభూతి అంటే. మిగతాది కాదా. ఎందుకు కాదు. అంతా అదే. కాని ఏషఉద్దేశతః ప్రోక్తః కేవల ముదాహరణ కోసం చెప్పానిలాగా. మరి వాస్తవమేమిటో తెలుసా. నతదస్తివినాయత్స్యాత్ మయా భూతం చరా చరం. నేను కాని పదార్ధమంటూ ఈ

Page 52

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు