#


Index

ప్రస్థానత్రయ సారము

మహా అయితే మనసుకు రాకుండా త్రోసి వేస్తాము. జ్ఞానమలా కాదు. సర్వమూ బ్రహ్మమని చూచే చూపు. అందులో అన్యమైన భావాలన్నీ కలుపుకొంటూ పోవాలి మనం. అప్పుడే ఆత్మ అనాత్మ అనే తేడా పోయి అంతా ఏకమనే ఏకాత్మ భావం సిద్ధిస్తుంది.

  ఇదే విద్య ఇదే గుహ్యం. విద్య అంటే జ్ఞానం. గుహ్యమంటే రహస్యం. అంతా తానే అయితే ఎవరున్నారిక చెప్పటానికి. అందుకే రహస్యమయింది. అనుభవమెప్పుడూ రహస్యమే. అందులో ఇది రాజరహస్యం. ఎక్కడో లేదా బ్రహ్మం. ప్రత్యక్షావగమం. ఎక్కడ చూస్తే అక్కడే. ఉండటమనే స్ఫురణే గదా అది. ఎక్కడ లేదు. ప్రతి పదార్ధమూ ఉందనే గదా స్ఫురిస్తుంటుంది. ఆ స్ఫురణే ఆత్మ. నీవు స్ఫురించే పదార్థాన్ని చూస్తున్నావు. అది సవికల్ప దృష్టి. అలా కాక వాటి స్ఫురణ చూడు. అది నిర్వికల్పం. సుసుఖం కర్తుం. అలా చూడటం కూడా కష్టం కాదు చాలా సులభమంటున్నది గీత. సొమ్ములు చూచినట్టు వాటిలో బంగారం మాత్రం చూడలేవా. అది కష్టమా. అలాగే ఇదీ.

  అసలు రహస్యమేమంటే ఆ స్ఫురణే అంతటా వ్యాపించి ఉంది. అందులోనే ఈ సమస్త భూతాలూ చేరిపోతాయి. కాని వీటిలో అది ఉందన గూడదు. అదే

Page 50

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు