#


Index

ప్రస్థానత్రయ సారము

పెట్టుకోవాలి. లేకుంటే పనుల భారం మనలను కుంగదీస్తుంది. ఈశ్వర జ్ఞాన మలవడదు. అంతా ఈశ్వరుడనే జ్ఞానం మనసులో గట్టి పడితే వాడు గత సంగుడే ముక్తుడే. అలాటి వాడే పని చేసినా సమగ్రం ప్రవిలీయతే. ఆ కర్మ ఫలంతో సహా సమసిపోతుంది. వాణ్ణి బంధించదు. వాడి జీవితమే ఒక మహా యజ్ఞం. జ్ఞాన యజ్ఞమది. భౌతికం గాదు. అందులో ప్రతి ఒక్క ఆలోచనా క్రియా బ్రహ్మ స్వరూపమే. జ్ఞానే పరి సమాప్యతే - ప్రతిదీ సమష్టి చైతన్యంగానే దర్శనమిస్తూ పోతుంది.

  ఇలాంటి జ్ఞాన మలవడాలంటే మాటలు గాదు. గురూప దేశ ముండాలి మొదట. గురువులంటే జ్ఞానులూ తత్త్వదర్శనులూ. వారిని శ్రద్ధాభక్తులతో సేవిస్తే జ్ఞానోపదేశం చేస్తారు. తన్మూలంగా సమస్త భూతాలలో ఆత్మనే దర్శిస్తూ పోయే సామర్ధ్య మేర్పడుతుంది. అవిద్యా కామాది కాలుష్య మెంత ఉన్నా అది జ్ఞానంలో ప్రక్షాళన మయిపోతుంది.

  కాని ఇలాంటి జ్ఞానయోగం కర్మ యోగం వల్లనే కలుగుతుంది. దానికి కొంత కాలం పడుతుంది. అది మన శ్రద్ధను బట్టి తత్పరత్వాన్ని బట్టి ఉంటుంది. అది ఒక శిక్షణ. దానివల్ల సంపాదించే ఉద్యోగం లాంటిది జ్ఞానం. జ్ఞానమే లభించిందో పరాం శాంతిం పరమమైన శాంతి

Page 42

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు