#


Index

ప్రస్థానత్రయ సారము

ఆభాసగా మరణిస్తాడు. ఇది ఒక గొప్ప అనుభూతి. సముద్రం జలంగా మరణించదు. తరంగ బుద్బుదాదులుగా మారుతుంది మరణిస్తుంది. తన మరణాన్ని తానే చూస్తుంది. అలా చూడగలిగితే మరణం కాదది. మోక్షం. క్రొత్తగా వచ్చేది గాదీ ఫలితం. వస్తు సిద్ధంగా ముక్తులమే మనం. బుద్ధి సిద్ధంగా కాకుండా పోయాము. మరలా వస్తువును గుర్తిస్తే అది వస్తు బుద్ధి కాబట్టి ఎప్పుడూ ముక్తులమే ననే ప్రత్యభిజ్ఞ కలుగుతుంది. ఆ జ్ఞానాగ్నిలో ఈ జ్ఞేయ ప్రపంచమంతా సమిధల లాగా కాలి బూడిద అయిపోతుంది. కాబట్టి అసలు సంసార బంధమనే ప్రశ్నే లేదు. దీనికే ప్రవిలాపన Thor-ough merger మని పేరు పెట్టారు. ఇదే జీవిత పరమార్ధమైన మోక్ష ఫలం.

Page 33

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు