#


Index

ప్రస్థానత్రయ సారము

విజ్ఞానమయ కోశం వాయువు లాంటిది. మనోమయం తేజస్సుకు. ప్రాణమయం జలానికి. చివర కన్న మయం పృథివికి సరిపడతాయి. అవి బ్రహ్మాండ మివి పిండాండం. Macro & Micro.

  ఇప్పుడీ అన్నమయాది కోశాలలో ఆత్మ చైతన్యమనేది మూసలో పోసిన పంచదార పాకానికా మూస రూపం వచ్చినట్టు ఆకోశ రూప మేర్పడి అలాగే కనిపిస్తున్నది. వీటిలో నుంచి బయట పడాలంటే ఈకోశాలు నా ఉపాధులే Media గాని నా స్వరూపం గాదని గుర్తించాలి ఈ జీవుడు. గుర్తించాలంటే శుద్ధ చైతన్యమే తానని దాన్నే మనసుకు తెచ్చుకోవాలి. అదే ఆత్మ భావన. ఈ భావన బలపడే కొద్దీ అన్నమయాది కోశాలను క్రమంగా దాటిపోయి చివరకు ఆనందామయాన్ని కూడా దాటుతూ పోతాడు. దాటుతూ పోతే అవి తన స్వరూపంలో లయమైనట్టు చూడగలడు. అప్పుడు వీటితో పాటు పృథివి మొదలు ఆకాశందాకా ఉన్న పంచభూతాలు కూడా లయం కాక తప్పదు. అప్పుడంతా ఆత్మ స్వరూపమే కాబట్టి జీవేశ్వరులనే తేడా కూడా వెంటనే తొలగిపోతుంది. అదే మోక్షం. ఇదీ తైత్తిరీయ సారం.

Page 21

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు