#


Index

  లేకపోతే పర్యవసానమిక మౌనమే. 'కథంబ్రవీమి' ఎలా చెప్పగలను అనే మాటకదే అర్ధం. ఏమీ చెప్పలేదంటే దానికర్థం మౌనమేకదా. ఆఖరుకు 'తదేకో వశిష్టః' అని కూడా చెప్పటానికి లేదు. ఏకమూగాదు కేవలమూ కాదని నిషేధించినప్పుడు 'తదేకః కేవలః' అని మాత్రమెలా చెప్పటం. అందుకే ఆ మకుటంకూడా తీసివేశారీ శ్లోకానికి, అదికూడా మానితే ఇక మౌనమే శరణ్యం. మౌనమంటే మాటలేదనే కాదు. మనోవాక్కాయ కర్మలు మూడూ లేవని. “మౌనం నామ అనాత్మ ప్రత్యయ తిరస్కరణస్య పర్యవసానం ఫలమ్" అనాత్మ భావాలన్నిటినీ నిరవశేషంగా పరిత్యజిస్తే చివరకు మిగిలేదే సర్వాత్మభావం. ఇక దానిని గురించి చెప్పేదేమిటి. నిశ్శబ్దంగా అనుభవించటమే మనకర్తవ్యం. పూర్వం బాష్కలి అనే మహర్షి బాధ్వుడనే బ్రహ్మవేత్త నడిగాడుట బ్రహ్మతత్వమేమిటో నాకు బోధించవలసిందని. దానికాయన నిశ్శబ్దంగా నిలిచిపోయాడట. అదేమిటి మహాత్మా! నాకు సమాధానమే చెప్పరని ఈయ నాయనను మరలా ప్రశ్నించాడట. చెబుతూనే వున్నాను. నీవర్ధం చేసుకోలేదని ఆయన మరలా సమాధానమిచ్చాడట. "ఉపశాంతో 2 యమాత్మా" సజాతీయ విజాతీయాలైన అన్ని భావాలూ ఉపశమించినప్పుడే మన ఆత్మ మనకనుభవానికి వస్తుంది. అలాంటి అనుభవాన్ని సంపాదించి పరమార్ధాన్ని చూరగొనటమే మానవులుగా మనం చేయవలసిన సాధన. అది చేయమని చెప్పటానికే జగద్గురువులీ నిర్వాణదశకంద్వారా మనకందరికీ చేసిన హితబోధన.

నిర్వాణ దశకం భూయాత్
బ్రహ్మనిర్వాణదాయకమ్ |
ఆచార్యేణ కృతం శక్త్యా
మయాభక్త్యా ప్రపంచితమ్ ॥

ఓమ్
శాంతిః శాంతిః శాంతిః

సమాప్తం