#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

గంభీరమైన అద్వైత భావం- దానిలోనూ శివాద్వైతమే గోచరిస్తుంది మనకు. దీనికీ నాటక కథకూ ఏమి సంబంధమని అడిగితే సామాన్య పాఠకుడి మనసు కేదీ స్ఫురించదు. బాగా లోతుకు దిగి చూచిన భావనా శీలుడికే స్ఫురిస్తుందొక గొప్ప సమన్వయం.

  అది ఏదోగాదు. ఇంతకు ముందు గానే నేను వాక్రుచ్చిన ఇహ పరాల సమన్వయం. శక్త్యాభిన్నమే ప్రపంచం. మరి ఆ శక్తి శివా భిన్నమే. కారణస్యాత్మ భూతా శక్తి:- శక్తి రాత్మ భూతం కార్యమన్నారు భగవత్పాదులు. అన్నిటికీ మూల కారణ మాపరమాత్మ. ఆయన నాశ్రయించిన పరాశక్తి ఆయన స్వరూపమే. కాగా ఆ శక్తి నుంచి ఏర్పడ్డ ఈ భౌతిక ప్రపంచమంతా ఆ శక్తి స్వరూపమే. ప్రపంచం శక్తి స్వరూపమైతే శక్తి పరమాత్మ స్వరూపం. అప్పటికి శివ శక్తి జగత్తులని త్రిపుటిగా కనిపిస్తున్న ఈ ద్వైత కలాపమంతా అంతర్ముఖంగా భావన చేస్తే నిజానికి సంపుటీకృత మైన శివాద్వైత రూపమే. ఇది అంచెల వారిగా మన బుద్దులకెక్కించటానికే ఈ మూడు నాందీ శ్లోకాలు ఉద్దేశించ బడ్డట్టు తోస్తుంది నాకు. ఇది ఇంతకు ముందే వ్యాఖ్యానించినా ఈ వెలుగులో క్రొత్తగా వ్యాఖ్యానించి చూడ వచ్చు శాకుంతలం నుంచి మనమీ మార్గంలో విక్రమోర్వశీయం దాకా పయనించవలసి ఉంటుంది. యా సృష్టి: .... అష్టాభిరీశ:- అని శాకుంతల పద్యం. ఆ ఈశ్వరుడు మిమ్ములను కాపాడు గాక. ఎలాంటి ఈశ్వరు డాయన. ప్రత్యక్షంగా మనందరికీ కనిపించే పృధివ్యాదులైన ఎనిమిది శరీరాలూ లేదా ఉపాధులతో కూడిన వాడు. ఆయన కాకపోయినా ఆయన ఉపాధులు కనిపిస్తున్నాయి మనకు. ఇది మొదటి దశ. దృష్టాచ్చ అదృష్ట సిద్ధి: అన్నారా చార్యులవారు. దృష్టమైన దాన్ని బట్టే అదృష్టమైన తత్త్వాన్ని అందుకోవాలి ఎప్పటికైనా. కనుకనే ఇది మొదటి భూమిక అని చెప్పటం.

  పోతే ఇక రెండవది దానినందు కొనే విధాన మేమిటని. ఆ విధానాన్ని బయట పెడుతున్నది మాళవికాగ్ని మిత్రంలో నాందీ శ్లోకం. ఏకైశ్వర్యే

Page 91

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు