#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

  శృంగార వీరాదులను మరలా మనమిక్కడ సాంప్రదాయికంగా కాక సాంకేతికంగా అర్థం చేసుకో వలసి ఉంది. శృంగార మంటే తాత్పర్యం సరసమైన హృదయధర్మం. వీరమంటే దుష్ట శిక్షణ ఆర్త జన రక్షణాదులు. శాంతమంటే వినయమూ వివేకమూ జ్ఞానవైరాగ్యాదులూ. ఇలాటి ఉన్నతమైన ఆదర్శాలన్నీ ఒకే ఒక పాత్రలో పొందు పరిచి అలాంటి వ్యక్తినే కథా నాయకుడుగా చేయటమే కాళిదాసులోని విశిష్టత. ఇది మరే నాటకంలోనూ కానరాని రహస్యం. దీనితో ధీరోదాత్త ధీరలలిత ధీరశాంతాదిగా ఆలంకారికులు చేసిన విభాగానికి కూడా చక్కని వ్యాఖ్యానం చేయగలిగాడు మహా కవి. ధీరోదాత్త అంటే వీరం. ధీరలలిత శృంగారం. పోతే ధీరశాంత శాంతమే. ఈ మూడింటికీ నాయకుడు ప్రతీక అయితే- ధీరోద్ధత అనే నాలుగవ దానికి ప్రతీక ప్రతి నాయకుడని కాళిదాసు చేసిన భావన. లోకకంటకమైన అలాటి ఉద్దతత్వాన్ని అణచిపుచ్చి లోక కళ్యాణానికీ - తద్వారా లోకోత్తరమైన నిశ్రేయసానికీ నోచుకోవాలి ప్రజా జీవితం. అందు కోసమే కాళిదాసు తన నాయక పాత్రలో ఈ త్రిగుణాలనే త్రివేణీ సంగమాన్ని నెలకొల్పటం. నాయకుడి ఈ సృష్టి ననుసరించే మిగతా పాత్రల నన్నింటినీ సృష్టిస్తాడు కాళిదాసు. వాటికొక ప్రాతిస్వికమైన ప్రయోజన మంటూ లేదు. ఈ మహా దర్శాన్ని నాయకుడు సాధించటానికి తోడ్పడటమే వాటి ప్రయోజనం. ఇది కూడా మనం గుర్తుంచుకో వలసిన ఒక గొప్ప రహస్యం. నాయకుడిలో శృంగార ప్రవృత్తి కాలంబనంగా ఒక నాయిక ఒక విదూషకుడు. వీరాని కనుగుణంగా శత్రు రాజులూ లేక రక్ష: పిశాచాది దుష్ట శక్తులూ - వారిని నిర్మూలించే ఉద్యమంలో ఇంద్రాది దేవతలకు కూడా అతడు సహకరించటం. కాగా ఇక శాంతాని కాశ్రయంగా కణ్వ నారదాది మహర్షులూ వారితో సాంగత్యమూ. ఇలాంటిదే ఎక్కడ చూచినా ఆయన నాటకాలలో విభిన్నమైన పాత్ర సృష్టి, ఇవన్నీ ప్రధాన నాయకుడిలో అంతర్లీనంగా ఉన్న ఆ భావత్రయానికి ముడిపడి ఆ మార్గంలో పయనించటానికే. పాత్రల నింతకన్నా ఎక్కువ మోతాదులో సృష్టించ వచ్చు ఎక్కువ వైవిధ్యంతోనూ ప్రదర్శించ వచ్చు మిగతా నాటక

Page 88

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు