#


Index

రచనా ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

  అయితే ఏమిటా నవీనత ఇతరు లెవరిలోనూ కానరాని ఆ గుణ మెలాటిదని ప్రశ్న వస్తుంది. అది ఆ మహా కవి దృష్టిలోనూ ఉంది సృష్టిలోనూ ఉంది. దృష్టి ననుసరించే గదా సృష్టి, దృష్టిలో లేనిది సృష్టిలోకి రాదు. మరి కాళిదాసు దృష్టి ఏమిటో ఇంతకు ముందే మనవి చేశాను. శివ శక్తి సామరస్యాత్మక మయిన దృష్టి అది. జీవుడు శివస్వరూపుడే మొదట. శక్తి ఎప్పుడూ అతని కధీనమే. కాని అవిద్యా దోషం వల్ల తన స్వరూపాన్ని తాను మరచి పోయాడు. తన్నిమిత్తంగా తన శక్తికే తాను దూరమై దేవుడు శాపగ్రస్తుడైన జీవుడయ్యాడు. మరలా కొంత కాలానికి దైవికంగా తన సుకృతం ఫలించి దాన్ని చేర్చే ఏదో ఒక ఆలంబనం దొరుకుతుంది. తన్మూలంగా జ్ఞానోదయమై కోలుపోయిన తన శక్తిని తాను మరలా సాధించి పూర్వ సిద్ధమైన తన ఈశ్వరత్వాన్ని తా నందుకొంటాడు. ఇదీ సంగ్రహంగా చెబితే కాళిదాసు దృష్టిలో ఉన్న నవీనత. ఈ దృష్టి రచనగా మారటమే సృష్టి, మరి రచనగా మరాలంటే దానికనుగుణంగానే సాగాలి రచన. ఏ మాత్ర మిటూ అటూ బెసక రాదు. అడుగడుగునా ఆ దృష్టిని మనకు స్ఫురింప జేస్తూ పకడ్బందీగా సాగాలి. అప్పుడే అది రచన అనిపించు కొనేది. రచన అంటే కూర్పని గదా అర్థం. దృష్టి కనుగుణమైన సామగ్రిని కూర్చుకోట మన్నమాట.

  సామగ్రి అనేది కథా వస్తువు కావచ్చు. పాత్రలు కావచ్చు. రసభావాలు కావచ్చు. అసలివి మూడే ఏ కావ్యానికైనా సామగ్రి. మరొకటి లేదు. కారణం జీవితానికి ప్రతిబింబమే కావ్యమంటే. జీవితంలో మనకు కనిపించే వివి మూడే. మన జీవితమే ఒక కథ. దీనిని గడుపుతున్న మనమే పాత్రలం. పోతే మన మనోభావాలే భావాలు. మన సుఖ దుఃఖాద్యను భవమే రసానుభవం. ఇంతకన్నా . ఏముంది జీవితం. అందుకే కావ్య జీవితంలో కూడా ఇంతకన్నా ఏదీ లేదని చెప్పటం. కాగా ఈ భౌతిక జీవితం మన దృష్టిని బట్టే ఎలా నడుస్తూ పోతుందో అలాగే కావ్య జీవితం కూడా కవి దృష్టిని బట్టే నడుస్తుంది. కవి దృష్టి ఏదో వర్ణించి చెప్పాము. పోతే దాని కనుగుణంగా సాగిన ఆయన కావ్య రచన మన

Page 58

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు