#


Index

స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

వాక్కుగా కాక అర్థంతో కలిపి పట్టుకొని ఆ అర్థ మర్థంగా కాక ఆత్మ రూపంగా భావించండి - అదే జీవిత ధ్యేయమని బోధించటమే ఆయన కావ్యరచనా పరమార్థం. తమర్థ మివ భారత్యా సుతయా యోక్తు మరిసి. వాక్కునర్ధంతో కూర్చినట్టునీ తనయను ఈశ్వరుడితో కూర్చమని సప్తర్షులు హిమవంతునికి సలహా ఇచ్చారంటే అది కవి మనకిస్తున్న సలహాయే. తద్వారా అశోచ్యత్వం హిమవంతుడి కెలా లేదో - భావుకులైన రసజ్ఞులకూ అలాగే ఉండబోదు. ఈ దృశమైన త్రివేణీ సంగమమే కాళిదాస మహాకవి వాణీ స్వరూపం.













Page 55

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు