స్వరూప ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
రంగ మంచం మీద ప్రదర్శించటాని కందులో ప్రతి ఒక్క అంశమూ అనువుగా ఉండాలి సుమా అని హెచ్చరించిన వాడూ ఆయనను భాసుడే. ఆ గురువు చేసిన ప్రతిహిత బోధ తూచా తప్పకుండా పాటించిన వాడూ కాళిదాసే.
అయినా చిత్రమేమంటే ఇంతగా భాసుని అడుగుజాడలో నడుస్తున్నా ఆయన కనులు కప్పి ఎప్పుడు తప్పించుకు పోతాడో - ఎంత దూరం వెళ్ళిపోతాడో కాళిదాసు. అన్ని విద్యలు నేర్పిన ఆ గురువుకు కూడా అంతు పట్టదా పోకడ. కథా వస్తువే గాదు - పాత్ర చిత్రణమే గాదు. భావ ప్రకటనమే గాదు వర్ణనలే గాదు పూర్వాపరాను సంధానమే గాదు పాత్రల సంభాషణాదులే గాదు రచనా సారళ్యమే గాదు. అన్నిటిలో భాసుని అనుసరిస్తున్నట్టే ఆయన సూత్రాలు పాటిస్తున్నట్టే కనిపిస్తుంది. కాని లోతుకు దిగి చూస్తే భాసుడు భాసుడే. కాళిదాసు కాళిదాసే. సంబంధమే లేదు. ఇంతెందుకు. భాసుని స్వప్న వాసవ దత్తం చూచే రచించాడు శాకుంతలం కాళిదాసు. వాసవదత్తే శకుంతల అనుకోవచ్చు. వత్స రాజే దుష్యంతు డనుకోవచ్చు మనం. కాని ఎవరికి వారే యమునా తీరే. ఏ పాత్ర కాపాత్ర సరిక్రొత్తగా కనిపిస్తుంది. ఎక్కడ ఉందో మర్మం చెప్పలేము. ఒక పరుస వేది వంటిది కాళిదాసు ప్రతిభ. అది సోకితే చాలు. ఎంత సోకితే అంత బంగారమే. అంతకు ముందున్న తామ్రం కనిపించదు. లోహం కనిపించదు మన కంటికి. హైమీ భూత మివాయస మని ఆయనేవా క్రుచ్చి నట్టు అయస్సు కాదది హైమమే.
అంచేత ఇంతకూ సారాంశ మేమంటే కాళిదాసు కావ్యమార్గంలో వాల్మీకి ననుకరించినా నాటక రంగంలో భాసుని అనుసరించినా వారు వారే. ఇత డితడే. కేవలం వారి వద్ద కళా సూత్రాలను మాత్ర మభ్య సించా డాయన. వారి శిక్షణలో పెరిగి పెద్దవాడయ్యాడు. కాని నైసర్గిక మైన ప్రతిభా సంపద ఎప్పుడూ ఉన్న దాయనకు. దానికి వన్నె పెట్టిన వ్యుత్పత్తీ ఉన్నది. కాగా వాటి రెంటినీ ఇంకా పరిపుష్టం చేసి ప్రదర్శించటానికా ఇరువురి పాఠశాలలో కొంత కాలం జీతం లేకుండా పని చేశాడు. అంతమాత్రమే.
Page 51