పిల్లలలాగా ఒకదాని కొకటి తీసిపోవు. అంతటి ప్రతిభాశాలి భోజుడంటే. విద్యా ఖేలన భోజ అని - భోజ క్షమాపతి విద్యా పరిపాక అని - తర్వాత వచ్చిన కృష్ణ రాయాదులను వర్ణించేటపుడు కూడా విద్యా విషయంలో మన కవులు భోజ రాజునే వరవడిగా తీసుకొన్నారంటే ఎంతటి మహానుభావుడో చూడండి ఆయన. అలాంటి విద్వత్కవి చక్రవర్తి ఆస్థానంలో వర్తించాడు కాళిదాసు లాంటి మహా కవి అంటే మంచిదే. బంగారానికి పరిమళ మబ్బిందనే సంతోషించవచ్చు. కాని నిజంగా వర్తించాడా అనేదే ఇప్పుడు సందేహం. మనం కాదు. చారిత్రకులే వెలిబుచ్చుతున్నా రీసందేహం. దీని నిజా నిజాలు ఎలా ఉన్నా ఒకటి మాత్రం నిజం. ఎవరు కల్పించారో ఏమో గాని ఆ కథలూ ఆ శ్లోకాలూ అతిలోక మయినవి. అతి మనోజ్ఞ మయినవి. కాళిదాసే వ్రాశాడన్నా తప్పులేదన్నంత గొప్ప రచన లవి.
పోతే ఈ మహా కవి ఏ కాలం వాడనే విషయంలో నాకొక ఆలోచన ఉంది మొదటి నుంచీ. అది ఈ ఐతిహాసికుల ఊహకు కూడా చాలా వరకు సరిపడే ఆలోచనే. కాళిదాసు గుప్తరాజుల కాలానికి చెందిన వాడని నా నమ్మకం. కొందరాయన క్రీస్తుకు పూర్వమని అతిశయోక్తిగా చెబితే చెప్పవచ్చు. అది అంతా వట్టి ఊహా గానం. శంకర భగవత్పాదులను గూర్చి చెప్పినట్టే ఉంటుందది. క్రీస్తుకు పూర్వం కాదేమి కాదు. తప్పకుండా గుప్తుల కాలం వాడే ఆయన. గుప్త చక్రవర్తులు క్రీస్తు తరువాత మూడవ శతాబ్దం నుంచి పరిపాలించా రీ దేశాన్ని. ఉజ్జయిని వారికి రాజధాని అయి ఉండాలి. స్వర్ణ యుగమని పేరు వారి రాజ్య పాలనకు. సరిగా బ్రిటను దేశంలో ఎలిజబెత్తు యుగం లాంటి దది. ఎలిజ బెత్తు ఆస్థానంలో షేక్స్పియరు లాంటి మహా కవి ఉన్నట్టే ఉన్నాడు కాళిదాస మహా కవి ఈ గుప్త రాజుల ఆస్థానంలో. గుప్తుల దగ్గర నవ రత్నాలని తొమ్మిది మంది మేధావంతు లుండే వారని ఘట కర్పరాదులు వారేనని వారిలో కాళిదాసాక రత్న మని - చారిత్రకులు
Page 3