#


Index

మహర్షుల లాగా అత్యున్నతమయిన స్థాయికెదిగి జీవిత రహస్యాలను దర్శించిన వాడు. నవీనమయిన దృక్పధంలో వాటినే అతి సుందరంగా ఆవిష్కరించిన వాడు. దర్శించినపుడు సత్యద్రష్ట, వర్ణించినపుడు సౌందర్య స్రష్ట, ప్రాచేత సాదులు సౌందర్య దూరులని కాదు. కావలసినంత ఉంది సౌందర్య సృష్టి వారి రచనలలో. కాని సౌందర్య మనేది అప్రధానం వారికి. సత్యమే సర్వ ప్రధానం. కాళిదాసు కలా కాదు. సత్య సౌందర్యాలు' రెండూ ప్రధానమే. దర్శించిన ప్రతి సత్యాన్నీ ఎంతగానో భావించి ఆ భావించిన ప్రతి ఒక్క భావాన్నీ ఎంతో మనోహరంగా వర్ణిస్తాడు. ఆ సత్య దర్శనమే ఆయన ప్రాచీనత అయితే ఈ సౌందర్యారాధనమే ఆయన నవీనత. రెండూ కలిసి ఆయనగారి ప్రత్యేకత.

  ఎప్పటివాడీ కాళిదాసు ఏమిటీయన జీవితం. ఎప్పటి వాడో ఏమో గాని ఎన్ని కథలో అల్లుకొని ఉన్నాయి ఈ మహా కవి చుట్టూ. అవి కట్టు కథలో అసలు కథలో ఏ మాత్రమూ మన కంతుపట్టని కథలు. తుదకు కాశీ మజిలీ కథలలాంటి కల్పనా కథలలో ఒక సంపుటం సంపుటమే ఉందాయన కథ. వినోద కథా కల్పవల్లి అని ఒక అద్భుతమైన కథా సంపుటమే ఉన్నది. భోజ కాళిదాస కథలనేవి ఇక చెప్పనే అక్కర లేదు. ఎవడో ఈ భోజు డీయన కాయన కేమిటో ఆ సంబంధం. భోజుడనే వాడు లేకపోలేదు . చరిత్రలో ఉన్నాడొక మహాపురుషుడు ఏదో ఒక చోట ఈ దేశంలో రాజ్య మేలిన వాడే. రాజమాత్రుడే గాక శాస్త్ర జగత్తులో కావ్య జగత్తులో కూడా ప్రశంసా పాత్రుడాయన. సరస్వతీ కంఠాభరణ మాయన వ్యాకరణజ్ఞతకు - శృంగార ప్రకాశ మాయన అలంకారజ్ఞతకు పాతంజల దర్శన వృత్తి ఆయన యోగ శాస్త్రజ్ఞతకు పెద్ద పెద్ద గీటు రాళ్ళు. అంతే కాదు. భోజ చంపువని వన్నె కెక్కిన ఆయన రామాయణ చంపువు లాంటి చంపూ కావ్య మిప్పటికి పుట్టలేదు. ఇక పుట్టబోదు. కాళిదాసు కవిత్వమూ ఆయన కవిత్వమూ కవల

Page 2