#


Index

స్వరూప ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

సన్మార్గమనే ఆలోకం కావాలి. ఇది సన్మార్గా లోకనాయ అనే నాలుగవ పాదంలో సూచన చేస్తాడు కవి. మంచిది. ఈ ఆలోకం సాధకుడి కెలా లభిస్తుందని అడిగితే ఏమి టాయన మనకిచ్చే సలహా. అది విక్రమోర్వ శీయ నాందీ శ్లోకంలో మన కందిస్తున్నా డాయన. ఎలాగా .

వేదాంతేషు యమాహు రేక పురుషం ప్యాప్య స్థితం రోదసీ యస్మి న్నీశ్వర ఇత్య నన్య విషయః శబ్దా యధార్ధాక్షరః అంతర్యశ్చ ముముక్షు భిర్నియమిత ప్రాణాది భిర్మృగ్యతే సస్థాణుః స్థిర భక్తి యోగ సులభో నిశ్రేయసా యాస్తు వః

  ఔపనిషదః పురుషః అని ఉపనిషత్తులన్నీ ఒకే ఒక ప్యూర్ణమైన తత్త్వాన్ని వర్ణించాయి. అది బాహ్యంగా ఈ రోదసి నంతా వాపించింది. బాహ్యంగా ఎలా వ్యాపించిందో మన ఆంతర్యంలో కూడా అలాగే నిండి నిబిడీ కృతమై ఉంది. ముముక్షు వైన వాడు దాని నంతరంగం లోనే వెదకి పట్టుకో వచ్చు. స్థిరమైన భక్తి యోగ ముంటే చాలు. అది సులభమే నని చా ుతాడు. మరి సులభమన్నారే ఏమంత సులభమా. ఎలాగా సులభమది చెప్పమని ప్రాధేయ పడితే బయట పెడ తున్నా డా రాజ రహస్యం మనకు చివరిదైన శాకుంతల పద్యం 5.

యా సృష్టిః స్రష్టురాద్యా వహతి విధి హుతం యా హవిర్యా చ హోత్రీ యేద్వే కాలం విధత్తః శ్రుతి విషయ గుణా యా స్థితా వ్యాప్య విశ్వం యామాహు స్సర్వ బీజ ప్రకృతి రితి యయా ప్రాణినః ప్రాణ వంతః ప్రత్యక్షాభిః ప్రపన్న స్తనుభి రవతువస్తాభిరష్టాభి రీశః

  ఇందులో పరమేశ్వరుడి అష్టమూర్తులు వర్ణించాడు కాళిదాసు. భూమి రాపో నలో వాయుః అనికాళిదాస ప్రత్యభిజ్ఞ లో భగవానుడు సెలవిచ్చిన మాటల కివి మారు మాటలు. పృథివ్యాదు లైన అయిదు మహా భూతాలు మనో బుద్ధ్యహంకారాలు మూడూ వెరసి అష్ట మూర్తులివి. చరాచర సృష్టి అంతా ఈ అష్ట మూర్తులే. ఈ అష్ట మూర్తులూ కల ఆ అష్ట మూర్తి ఎవరో కాదా

Page 28

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు