#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

కాళిదాస ప్రత్యభిజ్ఞ అభిమానం నిరభిమానమనే భేదం లేదు. అష్టాభిః.... నాభిమానః. ఎనిమిది శరీరాలున్నా ఏ శరీరంమీదా మమకారం లేదు. పృధివ్యాదులైన అష్టమూర్తులూ నావే. ఏదీ నాది కాదు. ఇదుగో ఇలాటి ఆలోకం మన కందినపుడే తామసమైన బ్రతుకంతా దేదీప్య మానంగా వెలిగిపోతుంది.

   మాళవిక నాందీ శ్లోకం నెపంగా మన కందిస్తున్న సమరస భావ మీదే మహాకవి. పరిగత శక్తి రాత్మభూః. అని శక్తి సమాలింగిత శివ తత్త్వా రాధకుడై గ్రహించ గలిగాడీ రహస్యం కాళిదాసు. శివ శక్తులకు ప్రతీకగా ఆయా పాత్రలను సృష్టించి వారి అవినాభావానికి ప్రతీకగా ఆయా కథలల్లి వారి విభానుభావాలనే అందులో ప్రత్యక్షరమూ పొందు పరిచి చివరకు వారి ఐక్యానుసంధానమే కావ్య ధ్వనిగా లోకానికి బోధించి - మమాపిచ క్షపయతు పునర్భవ మని తనకూ మనకూ కూడా పునరావృత్తి రహితమైన శాశ్వత కైవల్య పదాన్ని తత్త త్కావ్య నాటక రచనాప దేశంతో ప్రసాదించి తాను కృతార్థుడై సహృదయ జగత్తునంతా కృతార్థులను గావించి కడకు శివ సాయుజ్యం చెందాడా మహాను భావుడు.

   వస్తుత శ్శివమయే హృది స్పుటం - సర్వత శ్శివమయం విరాజతే నాశివం భవతి కస్యచిద్వచః తేన వ శ్శివమయీ దశా భవేత్

   అని లోకాని కంతా చాటిపోయిన మహా మాహేశ్వరుడూ శివాద్వయ దర్శన పారదర్శనుడూ అయిన అభినవ గుప్త పాదాచార్యుల మహోజ్జ్వల సందేశ మొకటి రసజ్ఞుల మనసులో నాటితే చాలు. అంతా శివమే. ఇలాటి శివాద్వయ ప్రత్యభిజ్ఞా మయమే కాళిదాసు జీవితం. దాని ప్రతిచ్ఛాయా మయమే ఆయన వాఙ్మయ జీవితం.

ఇతి

సర్వం శివం.

Page 247

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు