#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

సామ్యే స్థితం మనః అన్నది గీత. సామ్య దృష్టి జయం మానవుడుకి. వైషమ్య దృష్టి కాదు. అసలు వైషమ్యం లేదు సృష్టిలో. అది ఉన్నది మన దృష్టిలో. వస్తు సిద్ధంగా సామ్యమే ఉన్నది. మానవుడి దృష్టిగత మైనపుడే అది వైషమ్యంతో కప్పబడి కలుషితంగా సంకుచితంగా విపర్యస్తంగా భాసిస్తుంది. ఇది ఆభాసే గాని వస్తువు గాదు. వస్తువు శివ శక్యాత్మకమైన సత్య సౌందర్యాల పరస్పరా శ్లేషమే నని ఆ పురాణ దంపతుల దాంపత్యమే చాటుతున్నది. అది శబ్దార్ధాల దాంపత్యం ద్వారా లోకానికి చాటి చెప్పటమే కాళిదాసు పట్టుకొన్న ప్రత్యభిజ్ఞ. పెట్టుకొన్న ప్రతిజ్ఞ. దాన్ని తూచా తప్ప కుండా పాటించాడు చివర 'దాకా. ఎన్నుకొన్న కథా వస్తువులో చిత్రించిన పాత్రలలో పోషించిన రస భావాలలో చేసిన వివిధ వర్ణనలలో ఎక్కడ చూచినా మనం దాని విశ్వ రూపాన్నే దర్శంచ వచ్చు. అది శివ శక్తుల లీలా విభూతే.

  ప్రయాగ దగ్గర గంగా యమునా సంగమం వర్ణిస్తున్నాడు కవి. ఎలా ఉందా నదీద్వయ సంగమం కళిదాస మహాకవి దృష్టికి. శివ పార్వతుల సంగమమే అది. శివుడు గంగ అయితే పార్వతి యమున. గంగ తెలుపు యమున నలుపు. పాండు రాంగుడైన శివుడి కొకటి సంకేతమైతే మహా కాళి అయిన పరా భట్టారిక కొకటి సంకేతం. ఈ సంకేతార్థం బహుశా మనసులో పెట్టుకొనే చేసి ఉంటాడీ వర్ణన కాళి దాసు. చూడండి.

క్వచిత్ప్రభా లేపిభి రింద్ర నీలైః ముక్తా మయీ యష్టి రివాను విద్దా అన్యత్ర మాలా సీత పంకజానా- మిందీవరై రుత్వచితాంతరేవ.

క్వచి తగానాం ప్రియ మానసానాం - కాదంబ సంసర్గ వతీవ పంక్తిః. అన్యత్ర కాలాగురు దత్త పత్రి - భక్తిర్భువ శ్చిందన కల్పితేవ.

క్వచి త్ప్రభా చాంద్రమనీ తమోభి - శ్చాయా విలీనై శ్శబలీ కృతేవ అన్యత్ర శుభ్రా శరదభ్ర లేఖా రంధ్రీ ష్వివా లక్ష్య నభః ప్రదేశా

Page 245

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు