సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
అసలా మాటకు వస్తే భౌతిక జీవితానికీ అదే. దాని మీద ఆధారపడి నడుస్తున్నదే ఈ సృష్టి చక్ర మంతా. సృష్టి అంతా శివ శక్తి సామరస్య మయమే నని గదా పేర్కొన్నాము. శివ శక్తులంటే శబ్దార్ధాలే. శబ్దం దేవీ తత్త్వమైతే అర్థమనేది శివ తత్త్వం. శబ్ద మర్థాన్ని చెబుతుంది. అర్థం దాని వల్ల స్ఫురిస్తుంది. ఎంతెంత ఇది జీయట పెడితే దాన్ని - అంతంత అది ప్రకాశిస్తుంది. ప్రపంచమంతా వైఖరీ రూపమైన అమ్మవారి విలాసమే గనుక ఇందులో ఇది సుందర మిది దిసుం సుందర మనే భేద భావానికి చోటు లేదు. త్రిపుర సుందరి నిర్మాణమిది. అసుందర మెలా అవుతుంది. సుందరమైనా అసుందరమైనా రెండూ సత్యమైన ఆ శివ తత్త్వాన్ని చూపవలసిందే. సంకేతాలే ఇవి దానికి. అది ఈ రెండిటి లోనూ సమానంగా పరచుకొని ఉంది. సమం సర్వేషు భూతేషు తిష్ఠంతం పరమేశ్వర మని భగవద్వాణి. అవిభక్తం విభక్తేషు పరస్పర విభిన్నంగా కనిపించే సకల భావాలలో అభిన్నంగా ఉన్నదా సత్యం. అది మనకు భాసించాలంటే శబ్దరూపమైన ఈ సృష్టి కూడా అభిన్నంగానే మన కను సంధానం కావాలి. అలాటి సామరస్యాన్ని సృష్టిలో సర్వత్రా దర్శించమనికాళిదాస ప్రత్యభిజ్ఞ ే చెబుతున్నది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని శునిచైవ శ్వపాకేచ. వీటన్నిటినీ సమంగా చూడాలట మానవుడు. ఇలాటి ప్రబోధమే ఉత్తమ శ్రేణికి చెందిన మహాకవి కూడ లోకానికి చేయవలసి ఉంది. కవులలో ఉత్తమోత్తముడు కాళిదాసు. కనుక ఇంట గెలిచి రచ్చ గెలవ మన్నట్టు మొదట తాను దర్శించాడా సత్యాన్ని. పిదప చాటాడది లోకానికి రచనా ముఖంగా, వాగర్థావివ సంపృక్తా అనే ప్రార్ధనా శ్లోక మీ రహస్యాన్నే బయట పెడుతున్నది. వాగర్ధాలేవి ఆయనకు. పార్వతీ పరమేశ్వరులే. అంటే శివ శక్తులే. ఒకటి సృష్టి మరొకటి స్రష్ట, సృష్టినిబట్టి స్రష్ట నర్థం చేసుకోవాలి భావుకుడు. స్రష్ట సర్వ సముడు. అలాటి సమత్వాన్ని అనుభవానికి తెచ్చుకోవా లంటే దాని కనుభావక మీ స్పష్ట. సర్వమూ సమమని చూస్తేనే ఇది ఆ సమత్వాన్ని చూపుతుంది మనకు. లేకుంటే ఇదీ విషమమే ఈ అద్దంలో కనిపించే అదీ విషమమే మన పాలిటికి ఇహైవ తై ర్జితః సర్గః - యేషాం
Page 244