సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
గృహిణీ నేత్రాః - కన్యార్దేషు కుటుంబినః- ఆడపిల్లల విషయంలో ముఖ్యంగా గృహస్థుడైన వాడి కిల్లాలే నేత్రం లాంటిది. వ్యవహారం నడపవలసిం దావిడే నట. పోతే ఇక ఆవిడో. భర్త పెత్తన మిచ్చాడు కదా అని స్వతంత్రించేది కాదు. మేనే మేనాపి తత్సర్వం- భర్తురిష్టం పతివ్రతా. మీ ఇష్టమే నా ఇష్టమని చూపులతోనే సైగచేసి చెప్పిందట. ఏమి అన్యోన్యత ఆ దంపతులకు. పోతే వారి ప్రశ్నకు హిమవంతు డేమిచ్చాడు సమాధానం. సమాధాన మేదోగాదు. మంగళా లంకృత అయిన కుమార్తెను చూచి ఏహి విశ్వాత్మనే వత్సే - భిక్షాసి పరి కల్పితా. అమ్మా రా ఆ విశ్వనాధుడికే నిన్ను భిక్షగా అర్పిస్తున్నాను. అర్దించటానికి వచ్చారీ మహానుభావులు. ప్రాప్తం గృహ మేధి ఫలం మయా. గృహస్థాశ్రమ ఫలం నాకు లభించింది అని పిలుస్తూ అయ్యా ఇదుగో త్రిలోచన వధువు నీకు నమస్కరిస్తున్నది. ఆశీర్వదించండని ఆ మునులతో అంటాడు. వారి దీవనలు వడసి ఆవిడ అరుంధతీ దేవికి ప్రణమిల్లగానే అంక మారోప యామాస లజ్జమానా మరుంధతీ. సిగ్గుపడుతూ ఉన్న ఆ అమ్మాయిని లేవనెత్తి ప్రేమతో తన ఒళ్ళో కూచోబెట్టు కొన్నదట అరుంధతి. ఇక అమ్మాయి నాకు దూరమై పోతుందే అని తన్మాతరం చాశ్రు ముఖీం - దుహితృ స్నేహ విక్లబాం. కంట తడి పెట్టి దీనంగా చూస్తూ నిలుచున్న తల్లిని కాబోయే పెండ్లి కొడుకు గుణ గణాలు వర్ణించి చెబుతూ ధైర్యం చెప్పి ఓదార్చిందంటాడు కవి. ఇది చదువుతుంటే ఆ మేనకా దేవికాదు. మనం కూడా రసార్ద్ర హృదయులమై కంట తడి పెట్టవలసిందే. ఉత్తమ దాంపత్యం కుటుంబ జీవనం ఎంతగా కళ్ళకు కట్టినట్టు చూపాడో చూడండి. అదీ హిమవంతుడూ మేనకా. మామూలుగా కనపడే పర్వతమది. మనకు పర్వతమైతే కాళిదాసుకది ఒక ఉత్తమ గృహస్థుడు. ఆయన గృహిణి ఎలాంటిది. మేనాం మునీనామపి మాననీయాం. మహర్షులే మెచ్చు కోవలసిన సద్గుణ సంపన్నురాలు. మరి అలాంటి వారి కూతురో. సాక్షాత్తూ ఆ జగజ్జననే.
Page 205