సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
సప్త ఋషులను పిలిచి మరలా రాయబారం పంపుతాడు. పెండ్లి ముహూర్తం నిర్ణయించుకొని వచ్చి మూడురోజు లోపిక పట్టవయ్యా అని చెప్పినా పట్టలేక పోయాడట ఆ మహాత్ముడు. వినండి. కాళిదా సేమంటున్నాడో. పశుపతి రపి తాన్యహాని కృచ్ఛా దగమయ దద్రి సుతా సమాగమమోత్కః కమపర మవశం న విప్ర కుర్యు: విభుమపి తం యదమీ స్పృశంతి భావాః - ఆయన పశుపతి. ఆవిడ అద్రి సుత. అలాంటి వాడు కూడా ఆ యెడబాటు భరించలేక పోతే ఇక మనబోటి వాళ్ళ సంగతేమి టంటాడు. ఏమి టర్థం. పశువంటే జీవుడు. జీవుడు కాడు జీవులకు పతి ఆయన. జీవుడిలాగా ఆరాట పడరాదు. కామానికి లోను కారాదు. అయినా అయ్యాడు. అలాగే అద్రి సుత ఆవిడ, ద్రవించని దేదో అది అద్రి. ఏ మాత్రమూ చలనం లేనిది. అంటే పరాశక్తి అని అర్థం. పశ్యంతి మధ్యమల లాగా చలనం లేనిది పర. అలాంటి దయి కూడా అది చలించి వచ్చి పార్వతిగా జన్మించింది. సుత అంటే జాత అనే అర్థం. జన్మ లేనిది జన్మించిందంటే అది వాస్తవ మెలా అవుతుంది. వాస్తవాని కొక ఆభాస. ఇలాటి ఆభాసను కోరుతున్న దేమి టిక్కడ. పశుపతి. వాస్తవమైన తత్త్వం. అప్పటికి వస్తుభూతమైన చైతన్యం తన శక్తిని తానే కామిస్తున్నది. కామేశ్వరుడై కామిస్తున్నాడు. కామేశ్వరి అయి కామించ బడుతున్న దావిడ. ఇద్దరున్నారా. లేరు. వేరను కొంటే ఇద్దరు. కారనుకొంటే ఒక్కరు. అలా కాదనుకొంటూ ఏకమయ్యే ప్రయత్నమే కామించటం. ఇది దుష్యంతుడి మాటల్లోనే మనకు ధ్వనిస్తుంది. కామీ స్వతాం పశ్యతి. కామి తాను కామించిన దాన్ని తన స్వరూపంగానే చూస్తాడట. సమస్త ప్రపంచమూ తన్మయంగానే దర్శిస్తాడంటే ఏమని అర్థం. పరశక్తి పాత గృహీత చేతస్కుడై ఆ పరా భట్టారిక రూపంలోనే ఈ జగత్తును చూస్తాడని భావం.
అప్పటికి కాళిదాసు పోషించిన శృంగారం భౌతికమా అభౌతికమా. కామమనేది శారీరకమా ఆధ్యాత్మికమా. భాహ్యమైన సంకేత కవచాన్ని భేదించి
Page 203