#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

నాయిక. మజ్నూన్ నాయకుడు. ఎక్కడ ఉంది లైలా. లైలా అంటే అసలు రాత్రి అని అర్థం. మజ్నూన్ అంటే పిచ్చివాడు ఉన్మత్తుడని శబ్దార్థం. రాత్రేమిటి. పరమాత్మ తత్త్వం, అది మనకు రాత్రి లాగా దృష్టి గోచరం కాదు కాబట్టి రాత్రి అన్నారు. మరి అలా కాక పోయేకొద్దీ దాన్ని దర్శిం చాలనీ స్పర్శించాలనీ అనుభవించాలనీ జీవు డారాట పడటం సహజమే కాబట్టి సాధకులైన జీవులందరూ మజ్నూనులే. పిచ్చి వాళ్ళే.

  ఇది మనం సూఫీల వరకూ పోనక్కరలేదు.కాళిదాస ప్రత్యభిజ్ఞ లోనే యానిశా సర్వ భూతానా మనే శ్లోకాన్ని వ్యాఖ్యానిస్తూ భగవత్పాదులే అన్నారీ మాట. నిశేవ నిశా పరమాత్మ తత్త్వ మగోచరత్వాత్. ఇంద్రియాగోచర మైన పరమాత్మ రాత్రిలాంటి వాడేనట. ఇంతెందుకు. ఉపనిషత్తే చాటుతున్న దొక సత్యం. తద్యథా ప్రియయా స్త్రీయా సంపరిష్వక్తోన బాహ్యం వేద నాంతరం ఏవ మేవాయం పురుషః ప్రాజ్ఞే నాత్మనా సంపరిష్వక్తః న బాహ్యం కించన వేద నాంతరం - తద్వా అస్య ఏత దాప్త కామ మాత్మ కామ మకామం రూపం శ్లోకాంతరం. తన కిష్టమైన ప్రేయసి ఎదురు వచ్చి గట్టిగా కౌగిలించుకొంటే పురుషుడెలా బాహ్య స్మృతి అంతఃస్మృతి రెండూ కోలుపోతాడో - అలాగే ఆ పరమాత్మ కూడా వాటేసుకొంటే సుషుప్తి దశలో ఈ జీవుడికి బాహ్యాంతర ప్రజ్ఞ లేకుండా పోతున్నదట. చూచారా. ఇక్కడ పరమాత్మను స్త్రీతో పోల్చి వర్ణిస్తున్న దుపనిషత్తు. సూఫీ కవులు కాళిదాసు తరువాతి వారైనా ఉపనిషత్తు లాయనకు ముందున్నవే గదా. ఈ ఉపనిషత్కల్పన ఆయన మనసు నెంతగా దోచుకొన్నదో - ఆ కల్పనమే దోచుకొని మహా కవి తన స్త్రీ పాత్రలను పరమాత్మ కభిన్నంగానే భావించి కావ్య నాటకా లన్నిటిలో చిత్రించి చూపాడు. సందేహంలేదు. మామూలుగా స్త్రీ పురుషుణ్ణి తన పాటికి తాను స్వయంగా వచ్చి కౌగిలించు కోదు. ఇక్కడ పరమాత్మ స్త్రీ కావటమే కాక స్వయంగా ఆలింగనం చేసుకొన్నట్టు వర్ణించబడింది. అయితే ఆయన అలా కౌగిలించు కోవాలంటే జీవు డందుకోసం తపన చెందాలి. ఆరాట పడాలి. అప్పుడే ఆ

Page 200

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు