#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

దాని కాలంబనమైన నాయికా నాయకులను కాముకులుగా చిత్రించాడన్నా ఈ మహోన్నతమైన ఆశయాన్ని మనసులో ఉంచుకొనే. దృష్టిని బట్టి గదా సృష్టి, బ్రహ్మ సృష్టి అయినా ఇంతే. కవిబ్రహ్మ సృష్టి అయినా ఇంతే.

  అంచేత ఇప్పుడర్ద మవుతుంది మనకు కాళిదాసు దుష్యంతాది' పాత్రలలో అంతగా కామాన్ని ఎందుకు వర్ణించాడో. కామమనేది శారీరకం కాదక్కడ కాళిదాసు ఉద్దేశించింది. రథాంగ నామ్నో రివ భావ బంధనం బభూవ యత్ప్రేమ ఫరస్పరాశ్రయ మనిగదా దంపతుల ప్రణయాన్ని వర్ణించా డాయన. ప్రేమ భావ బంధన మన్నాడు కాని శారీర మనలేదు. చూచారా. అయితే శరీర సంపర్కం కోసమే ఏకరు తున్నట్టు కనిపిస్తారే ఆ నాయకులని అడగవచ్చు. అది ఇంతకు ముందు వాక్రుచ్చినట్టు భౌతికం కాదు. అభౌతికం. అభౌతికమైన భావమేది గానీ మన ఇంద్రియాలకు గోచరించదు. అగోచరమైన ఆ భావాన్ని స్పష్టంగా అనుభవానికి తెచ్చుకోవాలంటే మూర్తమైన శరీరాది సామగ్రే ఆలంబనం. ఇది ఆంతరమైన ఆ భావానికి భాహిరమైన ప్రతీక. అందుకే సూఫీ కవులెప్పుడూ ఇష్కే నిజాజీ ఇప్కే హకీకీ అని ప్రేమను రెండు జాతులుగా భావన చేస్తూ వచ్చారు. ఇష్క్ అంటే ప్రేమ. అది మిజాజీ అంటే లౌకికమూ కావచ్చు. హకీకి అంటే పారమార్థికమూ కావచ్చు. పారమార్థకమే వారు లోకానికి చెప్పదలచింది. దానికి కేవల మొక ప్రణాళికగా Medium మాత్రమే లౌకికమైన శృంగారాన్ని వర్ణిస్తూ పోతారు. లైలా మజ్నూన్ షీరీనో ఫరహాద్ - యూసఫో జులైఖా - ఇలాంటి కావ్యాలు వ్రాశారంటే ఈ దృష్టితోనే వ్రాశారు. లౌకికమైన కామ మలౌకికమైన కామానికి ఒక ఛాయ మాత్రమే. దీన్ని వర్ణిస్తున్నాడంటే కవి- దీని మీద కాదు తాత్పర్యం. దీని ద్వారా దీనిలో అంతర్లీన మయి ఉన్న ఆ అలౌకిక కామమే భావుకుడికి స్ఫురింప జేయాలని వారి ఆశయం. దంపతులంటే జీవేశ్వరులే వారి దృష్టిలో. నర నారాయణుల కలయికే నాయికా నాయకుల కలయిక. ఇది వారికి పేర్లు పెట్టటంలోనే మనకు ధ్వనిస్తుంది. ఇంతెందుకు లైలా మజ్నూన్ లైలా

Page 199

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు