సామరస్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
భాసిల్లుతుంటే చూచి నలుగురూ వారి దాంపత్యాన్ని ప్రశంసించా రంటాడు కవి. సామరస్యానికి మారు పేరే ఈ సమగుణ యోగం.
మహాకవి రచనలో ఉన్న ఈ ఆంతర్యాన్ని గుర్తించలేక లోకంలో తెలిసిన వారూ తెలియని వారూ నూటికి తొంబది మంది కాళిదాసంటే శృంగార లోలుడూ - శిశ్నోదర పరాయణుడూ కామ పురుషార్ధం తప్ప ఆయన జీవితంలో మరే భావమూ కనపడదు- అదే తన కావ్యాల్లో నాటకాల్లో విచ్చలవిడిగా వర్ణిస్తూ పోయాడని పరి పరి విధాల విమర్శిస్తూ పోతున్నారు. శృంగారం కామమంటే కాళిదాస మహాకవి దృష్తిలో ఉన్న అభిప్రాయమేమిటో వీరి కంతు పట్టటం లేదు. కామ మంటే సురత వ్యాపారమను కొంటున్నారు కాబోలు. అది కేవలం బాహ్యమైనది. శారీరకమైనది. అది కాదు కవి వివక్షితం. దానికి ప్రచోదకమైన ఇచ్చ. సృష్టి నంతా ఆక్రమించిన అమ్మ వారి ఇచ్చాశక్తి. జ్ఞానమే ఇచ్ఛగామారి సర్వతో ముఖంగా ప్రసరిస్తుంది. అది క్రియా రూపంగా మారి చేతనా చేతనాలనే తేడా లేకుండా సమస్త పదార్థాలనూ దగ్గరకు తెస్తుంది. కలిపి గట్టిగా ముడి వేస్తుంది. అవినాభావంగా ఏకం చేసి చూపుతుంది. తదపదేశంతో సృష్టి అంతా ఏకాత్మకమే సుమా పరస్పర భిన్నంగా కాక దీని నేక రూపంగా దర్శించి తరించమని భావుక లోకానికొక బ్రహ్మాండమైన సందేశాన్ని అందిస్తుంది. దీనిని బట్టి శృంగారమన్నా కామమన్నా అది నీవూ నేనూ అనుకొన్నట్టు భౌతికం కాదు. అభౌతికం. భౌమం కాదు. దివ్యం. మర్త్యం కాదు అమర్త్యం. అలా కాకుంటే శివ శక్తులు కామేశ్వరీ కామేశ్వరు లెలా అయ్యారు. అమ్మవారు కామ కళ ఎలా అయింది. కామ మిచ్చే. ఇచ్ఛా మాత్రం ప్రభోః సృష్టిః - అది భేద ప్రపంచాన్ని సృష్టిస్తుంది. మరలా ఈ భేదాన్ని లయం చేసి చూపుతుంది. ఈ అభేద భావనే కామం. భేదాన్ని చూస్తున్నంత వరకూ విశ్రాంతి లేదు. శాంతి లేదు. భేదాన్ని అభేదంగా మార్చు కొన్నప్పుడే శాంతి. ఈ అభేద ప్రాప్తి కోసం పడే తహ తహే అసలైన కామం శృంగారం. కాళిదాసు తన కావ్యాలను శృంగార రసంలో ముంచెత్తాడన్నా
Page 198