#


Index

సామరస్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

ప్రియాం స్వా మను వర్త మానః - తుమ్మెద పెండ్లి కొడుకు తన ప్రియురాలితో కూడి ఒకే కుసుమ పాత్రలో మధువును గ్రోలాడట. అర్థప భుక్తేన బిసేన జాయాం - సంభావయా మాస రథాంగ నామా. చక్రవాక పక్షి తాను సగం కొరికిన తామర తూడు తన జక్కవ పెంటి నోటి కందించిందట. దదౌ రసా త్పంకజ రేణు గంధి గజాయ గండూష జలం కరేణుః పంకజ రేణు వాసితమైన సరోవర జలం పుక్కిట బట్టి పెంటి ఏనుగు తన ప్రియుని నోటి కిస్తున్నదట. మరి శృంగేణ చ స్పర్శ నిమీలితాక్షీం - మృగీ మకండూయత కృష్ణ సారః స్పర్శ చేతనే అరగన్ను పెట్టిన ఆడు జింకను కృష్ణ సారం కొమ్ములతో నిమురుతున్నదట. ఏమిటీ వర్ణన. దేవ మానవ లోకం దాటి పశు పక్షి లోకానికి కూడా ఎలా ప్రవహిస్తున్నదో చూడండి ఉదాత్త దాంపత్య శృంగార రసం. వారి అన్యోన్య ప్రణయ సామరస్యం. అంతే కాదు. జంగమ స్థాయి కూడా గడచి లతా వృక్షాదులను కూడా వ్యాపించిందది. పర్యాప్త పుష్ప స్తబక స్తనాభ్యః - స్ఫురత్ప్రవాళోష్ట మనోహరాభ్యః వధూభ్య: తరవో వ్యవాపుః వినమ్ర శాఖా భుజ బంధనాని. లతలనే అంగనలు పుష్ప స్తబకాలనే స్తనాలతో ఎఱ్ఱని చిగుళ్ళనే పెదవులతో ఎంతో మనోహరంగా భాసిస్తుంటే తట్టుకోలేక తరువరేణ్యులంతా ఆ కాననంలో వారిని తమ శాఖా బాహువులతో బంధించారట. అసలు స్థావరా లేమిటి. నదీ సముద్రాలూ దంపతులే, భూమ్యాకాశాలూ దంపతులే. విద్యున్మేఘాలూ దంపతులే కాళిదాసు కళ్ళకు. అజుని ఇందుమతి పెండ్లాడటం జలనిధి మనురూపా జహ్ను కన్యా వతీర్ణా. సముద్రుని శరీరంలో ప్రవేశించిన జాహ్నవిలాగా ఉందట. శశిన ముపగతేయం కౌముదీ మేఘ ముక్తా. మేఘం నుంచి విడి వడిన చంద్రిక చంద్రుణ్ణి చేరినట్టున్నదట. మొత్తాని కిది స్థావర మిది జంగమ మిది చేతన మిది జడ మనే ప్రశ్న లేదు. మహాకవి దృష్టి కంతా శివ శక్తి సామరస్య విలాసమే. అదే సృష్టి అంతా పరుచుకొని కనిపించిం దాయన దృష్టికి. ఇతి సమ గుణ యోగ ప్రీతయ స్తత్ర పౌరాః వధూ వరులిద్దరూ సమ గుణ యోగంతో

Page 197

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు