#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

సర్గాంతంలో వృత్తం మారుస్తూ కూడా పోతారు. సర్గ మధ్యంలో కూడా అక్కడక్కడా ఛందో భేదం కనపడుతుంది. భారతంలో నైతే మొదట మొదట గద్య రచన కూడా కనిపిస్తుంది. తరువాతి కావ్య గద్య కేమాత్రమూ తీసిపోదు సరి గదా వాటికన్నా ధాటిగా సహజ సుందరంగా సాగుతుంది. పోతే ఇక వాల్మీకి ప్రతి కాండ ప్రతి సర్గ చివర అనేక వృత్త భేదాలు ప్రదర్శించాడు. కొన్ని సర్గలు సర్గలు సరికొత్త ఛందస్సులలో నడిపాడు. సమయోచితంగా రసభావోచితంగా ఛందస్సు మారుస్తూ పోవాలనే సందేశం ఆయనే అసలు కాళిదాసు కంద జేసింది.

  మరి కాళిదాసన్నారో ఆయన ఇతిహాస కవి కాడు. కావ్య కవి. ఐతిహాసిక కవులకే ఇంత అభిరుచి ఉంటే ఆయన సంగతి చెప్పన క్కర లేదు. గురువు గారు కొంచెం త్రాగమంటే శిష్యుడు పాత్ర నంత ఖాళీ చేసి కూచున్నాడు. ఒకటి గాదు రెండు గాదు. ఎన్నో ఛందస్సులు వాడాడు తన కావ్యాల్లో. అనుష్టుప్పు ఉపజాతి వంశస్థం ఇంద్ర వజ్ర ఉపేంద్ర వజ్ర వసంత తిలక ప్రహర్షిణీ పుష్పితాగ్ర వియోగిని రధోద్దత మందాక్రాంత స్రగ్విణి శిఖరిణి శార్దూల స్రగ్ధర ఇత్యాదిగా రంగు రంగుల వృత్తాలలో పొదిగి చూపాడు తన భావ రత్నాలను. ఐతే తాను పట్టు కొన్నది కావ్య మార్గం కాబట్టి దాని కనుగుణమైన ఒక బాణి కల్పించుకొన్నాడు. అదేనుంటే ఒక్కొక్క సర్గ ఒక్కొక్క ఛందస్సులో నడపటం. ప్రతి సర్గాంతంలో ఛందస్సు మార్చి ఒకటి రెండు శ్లోకాలు రచించటం. ఈ మాత్రమే కాదు. ఇది మిగతా కావ్య కర్తలు కూడా పాటించిందే. అయితే వారందరికీ ఆద్యుడు కాబట్టి ఆయనకీ కితాబు మనమిచ్చినా పరవా లేదనుకోండి. దాన్ని మించిన నైపుణ్య మెక్కడ ఉందంటే ఈ మహా కవిలో సరిగా త్యాగరాజ స్వామి కున్న నైపుణ్యమే అది. త్యాగయ్య ఏ రాగంలో ఏ భావ మావిష్కరిస్తాడో దాని కారాగం తప్ప మరొకటి పనికి రాదనిపిస్తుంది. అలాగే కాళిదాసు ఇన్ని వందల ఛందస్సులలో

Page 186

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు