#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

మాళవిక. భవానపి సూనా పరిసర చర ఇవ గృధ్ర: నీవో కసాయి దుకాణం చుట్టూ తిరిగే గ్రద్దలాగా ఆమిష లోలుపో భీరుకశ్చ. నోట్లో వేసుకోవాలని చూస్తావే గాని పిరికివాడివి. తస్మా దనాతురో భూత్వా కార్య సిద్ధిం ప్రార్ధయ మానో మే రోచసే. అంచేత ఊరక ఆరాట పడక కార్యం ఫలించేదాకా ఓపిక పట్టివుంటే నాకు నచ్చుతావు. శాకుంతలంలో అనసూయాదుల మరొక సంభాషణ వినండి. హలా శకుంతలే అత్రైవ తావన్ముహూర్తం తిష్ఠ. ఓసీ శకుంతలా ఇక్కడ కొంచెం సేపు నిలుచో. యావత్త్వయోప గతయా లతా సనాథ ఇవ కేసర వృక్షః ప్రతిభాతి. నీవు దగ్గర చేరితే లతతో కూడినట్టు కనిపిస్తుంది ఈ పొగడ చెట్టు. శకుం అతః ఖలు ప్రియంవదాసి త్వం. ఇందుకే గదే నీవు ప్రియంవద వయింది. దుష్యం - ప్రియమపి తథ్య మాహ ప్రియంవదా. ప్రియమైనా నిజమే చెప్పింది ప్రియంవద. అన- ఏ నాం నవమాలికాం విస్మృత వర్త్యసి. ఈ నవ మాలికను మరచిపోయావే శకుంతలా. శకుం- తదా ఆత్మానమపి విస్మరిష్యామి. అలాగైతే నన్ను నేనే మరచెననుకో. ప్రియం - అనసూయే జానాసి కిం శకుంతలా వన జ్యోత్స్మా మతి మాత్రం పశ్యతీతి. అనసూయా శకుంతల ఆ వన జ్యోథ్స్న నెందుకలా తదేక దృష్టితో చూస్తున్నదో తెలుసా. అనన ఖలు విభావయామి కథయ. తెలీదు చెప్పు ఎందుకో. ప్రియం - అపి నా మైన మహ మపి ఆత్మనోను రూపం వరం లభేయ. దీని మాదిరే నేనూ నాకు తగిన భర్తను పొందితే బాగుండునని. శకుం ఏష నూనం తవాత్మ గతో మనోరథః. ఏయ్ ఇది నీ మనసులో ఉన్న కోరికే సుమా. దుష్యంతుడు నిరాకరిస్తే శకుంతల అనే మాట వినండి. అనార్య ఆత్మనో హృదయాను మానేన పశ్యసి. క ఇదానీం అన్యో ధర్మ కంచుక ప్రవేశినః తృణఛన్న కూపోపమస్య తవాను కృతిం ప్రతి పత్స్యతే. తావదత్ర స్వచ్చంద చారిణీ కృతాస్మి యాహ మస్య పురువంశ ప్రత్యయేన ముఖ మథోః హృదయ స్థిత విషస్య హస్తాభ్యాశ ముపగతా. దుష్యంతుడు తృణచ్ఛన్న కూపం లాంటి వాడు. ధర్మమనే కవచం కప్పుకొన్న వాడట. ముఖంలో తేనె

Page 182

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు