#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

రెప రెప లాడుతూ వెనక్కు పోతున్నట్టు న్నదట. పుష్పకం మేఘపంక్తులు దూసుకొని పోతుంటే సీత దాని కిటికీ గుండా చేయి బయటికి జార విడిస్తే మేఘమనే గాజుల సెట్టి మెరపుతీగలనే బంగారు గాజు లావిడ చేతికి తొడుగు తున్నదట. అజుని నిద్ర లేపుతూ వంది మాగధు లిలా వర్ణిస్తారు ప్రభాత కాలాన్ని భవతి విరళ భక్తిర్మాన పుష్పోప హారః - స్వకిరణ పరివేషో ద్భేద శూన్యాః ప్రదీపా: - తెల్లవారుతూ ఉంటే రాత్రి ద్వారానికి కట్టిన పుష్ప మాలలు అందులోని పూలు వాడిపోగా సందు లేర్పడ్డాయట. దీప కాంతి కిరణాల చుట్టూ కనపడే పరివేషం హద్దులు చెరిగి పోయి కనపడకుండా పోయిందట. ఒక రాజుకు యౌవనం వస్తే అది ఎలా ఉందో తెలుసా. మధు వనితానాం నేత్ర నిర్వేశ నీయం. కోడెవయస్సు పూబోడులు చూపులతోనే ఆస్వాదించ వలసిన మధువట అది. సర్వాంగీణ మాకల్ప జాతం. శరీరమన్ని భాగాలలో ధరించిన ఆభరణ జాతమట. ఏమి సున్నితమైన భావాలివి. ఆలింగ్యంతే గుణ వతి మయా తే తుషారాద్రి వాతాః - పూర్వం స్పృష్టం యదికిల భవేశ దంగ మేభిస్తవేతి . యక్షు డంటాడు మేఘమిత్రుడితో. మీ వదినగారితో ఇలా వినకారు చేయి నా బాధ. అప్పుడప్పుడు మదనానల తాపానికి తట్టుకోలేక శరీరం చల్లబడాలని చల్లని హిమాలయ మారుతాల నాలింగనం చేసు కొంటుంటాను. ఎందుకో తెలుసా. అవి నీ ఒంటికి సోకి వస్తాయి కాబట్టి వాటినీ వాటేసుకొంటే నిన్ను వేసుకొన్నట్టే ఉంటుందని ఆశ. సముద్రుడికి నదులన్నీ ప్రియురాండ్రు. అవి దానిలో ప్రవేశిస్తుంటే వాటి తరంగాలూ దాని తరంగాలూ ఎదురవుతుంటే ఒకరి కొకరు పెదవులు కలుపుకొని అధరామృతాన్ని ఆస్వాదించి నట్టుందట. తరంగ హస్తాలతో నదీ మతల్లులు మనల నాహ్వానిస్తుంటాయట. శకుంతల ఆశ్రమం విడిచి వెడుతున్నది. అనుమతి ఇస్తారా అని అడిగితే కణ్వ మహర్షి పక్షుల కిల కిలా రావాలతో ఇచ్చామని చెబుతున్నాయట వన పాదపాలు. అజుడు భార్యా వియోగంతో దికాలు పడి కూచుంటే వసిష్ఠ మహర్షి శిష్యుడు వచ్చి గురువుగారి సందేశం వినిపించి తిరిగి వెడుతుంటే అంటాడు కాళిదాసు. తదలబ పదం హృది

Page 166

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు