#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

టంటే జీవితంలో ఒక కాలంలో మానవుడెంతో సుఖంగా ఉల్లాసంగా బ్రతుకు తుంటాడు. ఉన్నట్టుండి వాడి నసీబు తిరగ బడి అంతకు ముందెంత సుఖ పడ్డాడో అంత కంత కష్టాన్ని చవి చూడ వలసి వస్తుంది. ఎంత నవ్వుతామో అంత ఏడవ వలసి వస్తుంది. అందుకే లోకంలో ఒక ఆభాణకం కూడా వింటాము మనం. నవ్వులు నువ్వులవుతాయి అంత కంత అనుభవిస్తావు చూడమని. Anti-climax - Nemisis అని అనేకధా వర్ణిస్తారు అభిజ్ఞులు దీన్ని. ఇది ఎంతగా గమనించాడో ఈ లోకధర్మాన్ని కవి. మొదట ఎంతో గొప్పగా వర్ణిస్తాడొక సందర్భాన్ని ఎందుకా ఇంత బ్రహ్మాండంగా చేశాడీ వర్ణన అని ఆలోచిస్తుంటే తరువాత అర్థ మవుతుంది పాఠకుడి కది ఇందుకా అని. ప్రమోదం చివరకు ప్రమాదంగా పరిణమిస్తుంది. అంత వైభవంగా జరిగింది ఇలా దారుణమైన ఫలిత మీయటానికా అని తేట పడుతుంది. ఈ దారుణం మనసుకు రావాలంటే దాని రసానుభూతి కలగాలంటే భావుకుడి కా ముందు అంత వైభవంగా వర్ణిస్తే గాని కలగదు. అప్పుడే రెండింటినీ పోల్చుకొని అయ్యో ఎంత ప్రమాదం చివర కెంత విషాదంగా మారిందని ఒక అనిర్వచనీయమైన ఈశ్వర శక్తిని మనసుకు తెచ్చుకొని భావుకు డొకానొక నిర్లిప్తమైన దశ నందుకోగలడు. ఇదుగో ఇందు కోసంగూడా చేస్తాడు మహాకవి కొన్ని కొన్ని దీర్ఘమైన వర్ణనలు.

  చూడండి. రఘుమహారాజు దిగ్విజయ యాత్ర ఎంతో విపులంగా వర్ణించాడు రఘువంశంలో. అంతా అయిన తరువాత చివరకు విశ్వజిత్తనే యాగం చేసి తాను సంపాదించిన దంతా దాన ధర్మాలు చేసి నివ్వరి కాడ లాగా తుదకు ఏదీ మిగలక నిలిచి పోతా డా రాజు. అప్పుడెవరో పంపినట్టు వచ్చి అడుగుతా డొక బ్రహ్మచారి నాకు పదునాలుగు కోట్ల బంగారు నాణాలు కావాలి గురుదక్షిణ కోసమని. ఇలాగే అజ మహారాజు స్వయంవరోత్సవం కళ్యాణోత్సవం ఎంతో దేదీప్య మానంగా వర్ణించాడు కవి. అంత వైభవంగా సాగిన ఆ వివాహమూ చివరకెలా పరిణమించిందో తెలుసా. ఇందుమతీ దేవి

Page 150

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు