#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

వన దేవతలా ప్రత్యక్షమయింది. ఆవర్జితా కించిదివ స్తనాభ్యాం. స్తన భరంచేత శరీర యష్టి కొంచెం వంగి వయ్యారంగా నడుస్తుంటే కుసుమ స్తబకాలతో వంగి నడచి వస్తున్న లత లాగా కనిపిస్తున్నదట. మాటిమాటికీ జారి పోతున్న మణిమేఖలను పైకి తోసుకొంటూ వస్తున్నది. అధరబింబాన్ని స్పృశించటానికి ముసురుకొనే భ్రమరాలను బెళుకు చూపులతో చూస్తూ తన లీలారవిందంతో నివారిస్తున్నదట. చెలికత్తెలైన జయా విజయా ఇరువురూ ఇరువైపులా ఉపచరిస్తూ వస్తున్నారు. అలాంటి ఆ త్రిపురసుందరి. దెస చూచే సరి కొక్కసారిగా పోయిన ప్రాణం లేచి వచ్చిందట మన్మధుడికి. మనస్సును మధించే ఇలాటి వర్ణన చూస్తే మనకూ అలాగే లేని ఉత్సాహం పొంగి వస్తుంది సందేహం లేదు. అసలా మన్మధుడింకా వచ్చాడో లేదో అంతకు ముందే ఆ చెహరాలు కనిపిస్తూ వచ్చాయి ఆశ్రమంలో. అకాల మనో వికారాలకు పాలయి గంతులు వేస్తున్న ప్రమధ గణాల గల్లంతు చూచి ఒక్క సారి గద్దించి చూస్తాడు ద్వారపాలకుడైన నందికేశ్వరుడు. అప్పుడెలా అయిపోయిందో తెలుసా ఆ కాననం. కాళిదాసు నడిగితే చెబుతాడు. నిష్కంప వృక్షం- నిభృత ద్విరేఫం-మూకాండజం-శాంత మృగ ప్రచారం. చెట్లు కదలటం లేదు. తేంట్లు మెదలటం లేదు. పక్షులు కూతలుమాని నోళ్ళు మూత పడ్డాయి. మృగాలు అటూ ఇటూ తిరగటం మానేసి ఎక్కడివక్కడ ఆగి పోయాయి. మొత్తం మీద వాలకం చూస్తే చిత్రపటం లోని బొమ్మలలాగా అగి పోయిందట ఆశ్రమమంతా. ఎలాంటి చిత్రమిది. కదలిక లేని చిత్రం.

  ఇలాటి చిత్రమే మనకు మాళవికాగ్ని మిత్రంలో ఒకటి కనిపిస్తుంది. వామం సంధి స్తిమిత వలయం న్యస్య హస్తం నితంబే...... కాంత మృజ్వాయ తార్థం. మాళవిక నాట్యం చేసి చేసి ఒకానొక భంగిమలో అలా నిలిచి పోతుంది. ఆ నిలిచిపోయిన రూపమెలా ఉందంటే- గాజుల గలగలలు లేని వామ హస్తం పిరుదుల మీద చేర్చి ఉంది. క్రిందికి వాలిన చెట్టుకొమ్మలాగా వదులుగా జారవిడిచింది కుడి చేయి. పాదాల తాకిడికి చెదరి పోయిన పూలతో కూడిన

Page 139

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు