సౌందర్య ప్రత్యభిజ్ఞ
కాళిదాస ప్రత్యభిజ్ఞ
మనోహరమైన భావమిది. మాతృ వాత్సల్య మెంత గొప్పదో నదీ మతల్లిలో కూడా కనపడుతున్నదా రాముడికి. కాదు కాళిదాసుకు.
పోతే ఈ నదులన్నిటికీ ఏకైక వల్లభుడు సముద్రుడు. ఆయన ఎలా
కనిపిస్తాడో తెలుసా కాళిదాసు దృష్టికి. ముఖార్పణేషు ప్రకృతి ప్రగల్బా:
స్వయం తరంగాధర దాన దక్ష: తన ప్రియురాండ్రైన నదులు స్వయంగా
పెదవు అందిస్తుంటే తానూ వారికి తరంగాలనే పెదవులు సోకిస్తూ లోకంలో
ఏ ప్రేయసీ ప్రియులలోనూ చూడని పరస్పరాధరామృత పాన వ్యవహారం
క్రొత్తగా చూపుతున్నాడట. నదీ సముద్రాలే గాదు. పట్టణాలు కూడా
పట్టమహిషుల లాగే గోచరిస్తా యాయనకు. అయోధ్యా పట్టణమైనా ఆయన
పాలిటి కొక దేవతే. ఉన్నట్టుండి ఆవిడ కుశ మహారాజుకు కలలో
కనిపిస్తుంది. అదీ ఎలాగా. తలుపులన్నీ మూసి గడియ పెట్టి ఉంటే కూడా
లోపల ప్రవేశించింది. ఎలా ప్రవేశించిం దంటారు. ఛాయామివా దర్శతలం.
మన నీడ అద్దంలో లాగా ప్రవేశించిందట. ఏమి అద్భుతమైన ఉపమానం.
అలా ప్రవేశించి అతడులికి పడి చూస్తుంటే ఇక ఏకరువు పెడుతుంది తన
గోడంతా. కుమారా! నీ తండ్రి మరణానంతరం నే ననాధ నయ్యాను. నా
పూర్వ వైభవ మంతా అస్తమించి పోయింది. కలహంసలూ మయూరాలూ
తిరిగిన చోట వ్యాఘ్ర వరాహాలు సంచరిస్తున్నాయి. భవనాలన్నీ వనాలయి
పోయాయి. దీపకాంతులకు మారుగా ధూమక్రాంతులే కనిపిస్తా యెక్కడ
చూచినా. మరలా నీబోటి మహనీయుడు వచ్చి పాలిస్తేనే గాని బాగు పడదు
నా సౌభాగ్యమని వాపోతుంది. ఇది పట్టణమా పట్టణాధిదేవతా. దేవతే కవి
దృష్టికి. అది ఇప్పుడు గతి చెడి ముదుసలి అయినా ఒకప్పుడు
తరుణవయస్క.
రాముడు తిరిగి అయోధ్యకు వచ్చినపు డెలా కనిపించిందో తెలుసా అది. ప్రాసాద కాలాగురు ధూమ రాజి: తస్యా: పురో వాయు వశేన భిన్నా. నగర ప్రాసాద పంక్తుల నుంచి అగరు సాంబ్రాణి ధూమం గాలికి చెదరి
Page 133