#


Index

సౌందర్య ప్రత్యభిజ్ఞ కాళిదాస ప్రత్యభిజ్ఞ

నిజానికా గురువుగా రెవరో కాదు. తానే. ఆ మాళవిక శరీర మేదో గాదు. తన కావ్య శరీరమే, ఆ కన్య సౌందర్యం కావ్య కన్యా సౌందర్యమే. గురువుగా రాసించినట్టుం దనటం తాను భావించినట్టు తన కావ్యం సర్వాంగ సుందరంగా నిర్మించ బడటమే.

  ఇంత సర్వాంగ సుందరమూ సమగ్రతా బంధురమూ అయి ఉండాలి కావ్య నిర్మాణ మనేది కాళిదాసు దృష్టిలో. అయితే ఇది సరియైన దృష్టి యేనా అని ప్రశ్న. ఎందుకంటే ఈశ్వర సృష్టిలో సుందరం కాని అంశం మంటూ ఏదీ లేదని ఇంతకు ముందే పేర్కొన్నాము. ఏది ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంది ఈ సృష్టిలో. ఏదీ హేయం కాదని గదా సిద్ధాంతం. పారమేశ్వరమైన విభూతి అన్నప్పుడంతా అనవద్యమే కావాలి గాని సావద్య మెలా అవుతుంది. * అలాంటప్పుడు సామగ్ర్య విధౌ గుణానాం పరాఙ్మఖీ విశ్వ సృజః ప్రవృత్తిః విశ్వ కర్త చేసిన ఈ సృష్టి సమగ్రం కాదని సర్వాంగ సుందరం కాదని - కవి సృష్టే మహనీయ మని కాళిదాసు పేర్కొనట మేమి బాగు. నిజమే. పైకి చూస్తే ఏ మాత్రమూ యుక్తి సహంగా కనపడదీ మాట. కాని మాటను గాక మాటలోని ఆంతర్యాన్ని భావన చేయ గలిగితే పారబాటు లేదు సరిగదా అదే సబబని నిర్ధారణ అవుతుంది. పారమేశ్వరమైన సృష్టి అంతా రమణీయమే మహనీయమే నని తెలియని వాడు కాడు కాళిదాసు. శివ శక్తి ద్వయాత్మకమైన ఈ జగత్తు నసుందరమని ఎలా అనగలడా శివాద్వయ దర్శన పార దర్శనుడు. ఇది సుందర మది కాదనే భేద దృష్టి ఉన్నవా డయితే అష్టధా భిన్నమైన పరమాత్మ విభూతి నలా కీర్తించ గలడా. పైగా ఏకస్త్వం బహురూప భాక్. నానా రూపాలుగా భిన్నమై కనిపిస్తున్నదా ఏకమైన తత్త్వమే. త్వయ్యేవ నిపతంత్యోఘా జాహ్నవీయా ఇవారివే. ఎన్ని భిన్న మార్గాలయినా అన్నీ కలిసి చివరకందులో చేరిపోయేవే. ద్రవ స్సంఘాత కఠినః ద్రవంగా ఘనంగా స్థూలంగా సూక్ష్మంగా లఘువుగా గురువుగా వ్యక్తంగా అవ్యక్తంగా కనపడతున్న దెవరంటారు. అంతా ఆ పారమేశ్వరమైన శక్తే. ఇదంతా దాని విభూతే నని

Page 128

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు