10
"సర్వాత్మత్వ మితి స్పుటీ కృత మిదం యస్మాదము ష్మింస్తవే" ఈ సర్వాత్మ భావాన్ని బోధించటానికే ఈ స్తోత్ర మస లవతరించింది. దీనినే ఇంతవరకూ తొమ్మిది శ్లోకాలలో ఏకరువు పెడుతూ వచ్చారు భగవత్పాదులు. ఇందులో మొదటి మూడు శ్లోకాలలో జగన్మిధ్యాత్వాన్ని ప్రతిపాదించారు. తరువాత మూడింటిలో జీవేశ్వర అభేదాన్ని నిరూపించారు. ఏడవ దానిలో ఆత్మానాత్మలు రెండింటిలోనూ ఆత్మే నిత్యమని అనాత్మ జగత్తంతా అనిత్యమని వర్ణించారు. పోతే ఎనిమిదిలో ఆత్మకు ఈ అనాత్మతో సంసర్గమెలా ఏర్పడుతున్నదో రోగ నిదానం బయటపెట్టారు. కాగా ఆ రోగానికి చికిత్స తొమ్మిదిలో సూచించారు.
అయితే ఆ సూచించటంలో విమృశతాం అనే మాట ఒకటి దొర్లింది స్వామి వారి నోట. బంగారం వంటి మాట అది! సాధన రహస్యమంతా ఆ మాటలోనే గుప్తమయి ఉంది. అంత గుప్తమయితే సాధకులర్ధం చేసుకోవటం కష్టం గదా. అందుకోసమా మాటనే సాగదీసి అందులోని భూమికా క్రమాన్ని చక్కగా వివరించి చెబుతున్నారీ ఫల శ్రుతి శ్లోకంలో.
Page 89