#


Index

  ఇదీ అలాంటిదే. మాయ కమ్మేసరికి పరిపూర్ణమైన ఆ చైతన్యమే దేశకాల వస్తువులుగా పరిచ్ఛిన్నమై Fragmented ఇలా చరాచర ప్రపంచంగా మనకు భాసిస్తున్నది ఇదే వ్యామోహం మన పాలిటికి అఖండమైన తత్త్వాన్ని ఖండమని భావించటం. మరి ఈ వ్యామోహ మెలా తొలగుతుందని ప్రశ్న. సంహారిణే దానిని మరలా ఉపసంహరించాలి ఉపసంహరిస్తే ఎక్కడికక్కడ పరిచ్ఛిన్నంగా తోచే ఈ ప్రపంచమంతా అపరిచ్ఛిన్నమై ఆ ఈశ్వర చైతన్యంగానే మన అనుభవానికి రాగలదు.

  బాగానే ఉంది కాని ఎవరా సంహరించవలసింది మనమా ఆ ఈశ్వరుడా. మనం కాదు ఈశ్వరుడే. మనకు ఆ దొమ్మ ఉంటే ఎప్పుడో చేసి ఉండేవాళ్లమా పని. అది లేకనే ఇలా తలమునకులవుతున్నా మీ సంసారంలో. కాబట్టి ఈశ్వరుడే చేయాలి ఉపసంహారం. ఆయన మనలాగా అసమర్థుడు కాడు. సర్వసమర్థుడు. అందుకే ఈశ్వరు డయ్యాడసలు. పైగా కరుణాళుడు కనుకనే ఆగ్రహించి ఎలా మనలను బంధించాడో అనుగ్రహించి అలాగే మనలను ముక్తులను చేయగలడు. తిరోధానమూ - అనుగ్రహమూ ఈ రెండు శక్తులూ ఆయన గారి చేతిలో ఉన్నాయి. తిరోధానమే జన్మ జన్మల నుంచీ మన వెంటబడ్డ ఈ సంసారం. అనుగ్రహం మరలా మనకు జ్ఞానోపదేశం చేసి దీనిలో నుండి బయటపడవేయటం. ఇదే సాక్షాత్తత్త్వమసి అని ఇంతకు ముందు చెప్పిన మాట కర్థం. దక్షిణామూర్తి రూపంలో వట వృక్షం క్రింద కూచొని వసిష్ఠాదులకు బ్రహ్మోపదేశం చేశాడని గదా చెప్పాము.

Page 54