#


Index

చిత్రతరంగిణి

అలా సహజంగా ఉన్న సంస్కారాన్నే నిసర్గమంటారు. 'నిసర్గసంస్కార వినీతబుద్ధి' అని గదా చాటించాడు కాళిదాస మహాకవి. నిసర్గ మంటే జన్మతః ఏర్పడే సంస్కారమే. అది లేశమున్నా చాలు. దానిబలంతో ఎంతైనా ఆర్జించవచ్చు. ఇనుమే ఇనుము నాకర్షిస్తుంది. వజ్రమే వజ్రాన్ని భేదిస్తుంది. సంస్కారమే సంస్కారాన్ని సంపాదిస్తుంది.

  అయితే అలాంటి గ్రహణధారణ పటువులకు సంస్కారాన్ని అందజేసే సాధనమేమిటి? సాధనమనేది లేకుండా సాధ్యమనేది ఎప్పుడూ సిద్ధించదుగదా అంటే సంస్కారసాధనాలు అనేకమున్నాయి. లోకంలో అందులో చాలా గొప్పదీ శక్తిమంతమూ అని చెప్పదగిన సాధనం ఒక్కటే. అదే కళ. కళ అంటే దీప్తి అని అర్థం. మానవజీవితాన్ని దేదీప్యమానంగా చేయగలిగిందేదో అదేకళ. జీవితం సహజంగా అంధకార బంధురమై ఉంటుంది. దీప్తి లభిస్తే గాని అది తన గమ్యాన్ని చేరుకోలేదు. 'తమసోమా జ్యోతిర్గమయ తమస్సులో నుంచి తేజస్సు లోకి పయనించవలసి ఉంది మన జీవితం. అలాంటి తేజస్సును ప్రసాదిస్తుంది గనుకనే అది కళ అయింది.

  కళ అంటే మరొక అర్థం కూడా ఉంది. 'కలయతీతి' కళా. కలనం చేసేదేదో అదే కళ, కలసమంటే కలుపుకోవటం, మంచీ చెడ్డా తేడా లేకుండా అన్ని విషయాలను కలబోసుకొని జీవితంలో ప్రతి ఒక్కదానికీ స్థానమున్నదని సానుభూతితో చూడటమే కలనమనే మాటకర్థం. అలా చూడగలిగిననాడు దేన్నీ భూషించలేము. దేన్నీ దూషించలేము. అంతా ఒకే ఒక తత్వమనే సాగరంలో ఉదయించే తరంగాలుగానూ, ఒకే తత్త్వమండలం నుంచి ప్రసరించే కిరణజాలంగానూ చూస్తాము. మరొక మాటలో చెబితే అనేక రూపాలుగా భాసించే ఈ చరాచర సృష్టిలో ఏకరూపాన్నే స్పష్టంగా దర్శించగలం. అలాంటి ఏకత్వదృష్టిని ప్రసాదించేది కళ.

  అసలీ ఏకత్వదర్శనమే కళా జగత్తును శాస్త్ర జగత్తునుంచి వేరుచేసి చూపుతుంది. శాస్త్రమూ మనకు అందిస్తూనే ఉంది అంతో ఇంతో విజ్ఞానాన్ని, సంస్కారాన్నీ. అయితే శాస్త్రానికి విజ్ఞానమే ప్రధానం గానీ సంస్కారంకాదు. సంస్కారం దాని కానుషంగికం. ఊహను పెంచటమే శాస్త్రం పని అయితే, ఆ ఊహలలో పేరుకొని ఉండే కాలుష్యాన్ని కడిగివేయటమే కళా ప్రయోజనం. శాస్త్రం పెంచితే కళ త్రుంచుతుంది. వెట్టి మొట్టిగా పెంచటంలో లేదు అందం. చక్కగా త్రుంచటంలో ఉంది. జుట్టు పెరగటానికి

Page 90

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు